పాతికేళ్ల తర్వాత ఎన్నికల బరిలో మహిళా అభ్యర్థి.. ఎక్కడో తెలుసా..?
దిశ, వెబ్‌డెస్క్: మహిళా హక్కులు, సమానత్వంపై మాట్లాడమంటే మైకులు అరిగే దాకా, ప్రజలు విసిగిపోయే దాకా ఏకబిగిన గంటల పాటు ఉపన్యాసాలు దంచే మన నాయకులు వాస్తవానికి మాత్రం అందుకు విరుద్ధంగా ఉంటారు. చట్టసభల్లో 33 శాతం మహిళా రిజర్వేషన్ కోసం పోరాడుతున్న ఈ దేశంలో.. ఒక రాజకీయ పార్టీ 25 ఏళ్లుగా మహిళా అభ్యర్థిని ఎన్నికల్లో పోటీకి దించలేదనే విషయం ఎంత మందికి తెలుసు..? ఇది నిజం. కేరళలో 73 ఏళ్ల గ్రాండ్ ఓల్డ్ పార్టీగా […]
దిశ, వెబ్‌డెస్క్: మహిళా హక్కులు, సమానత్వంపై మాట్లాడమంటే మైకులు అరిగే దాకా, ప్రజలు విసిగిపోయే దాకా ఏకబిగిన గంటల పాటు ఉపన్యాసాలు దంచే మన నాయకులు వాస్తవానికి మాత్రం అందుకు విరుద్ధంగా ఉంటారు. చట్టసభల్లో 33 శాతం మహిళా రిజర్వేషన్ కోసం పోరాడుతున్న ఈ దేశంలో.. ఒక రాజకీయ పార్టీ 25 ఏళ్లుగా మహిళా అభ్యర్థిని ఎన్నికల్లో పోటీకి దించలేదనే విషయం ఎంత మందికి తెలుసు..? ఇది నిజం. కేరళలో 73 ఏళ్ల గ్రాండ్ ఓల్డ్ పార్టీగా పేరున్న ఇండియన్ మూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్).. గడిచిన 25 ఏండ్లలో ఒక్క మహిళకు కూడా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వలేదు. తాజాగా ఆ రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా ఎట్టకేలకు ఓ మహిళకు ఆ అవకాశం వరించింది.
కేరళలో కాంగ్రెస్‌తో కలిసి (యూడీఎఫ్ కూటమి) పోటీ చేస్తున్న ఐయూఎంఎల్.. ఇటీవలే 27 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను విడుదల చేసింది. ఆ పార్టీ మహిళా విభాగపు రాష్ట్ర మహిళా మాజీ సభ్యురాలు నూర్బీన రషీద్ ఈసారి ఎన్నికల బరిలోకి దిగబోతున్నారు. కోజికోడ్ సౌత్ నుంచి ఆమె పోటీ చేయబోతున్నారు. ఐయూఎంఎల్ చివరిసారిగా 1996 ఎన్నికల్లో ఖమారున్నీస అన్వర్‌కు పోటీ చేసే అవకాశం ఇచ్చింది. ఆ తర్వాత ఇప్పటివరకు మహిళలను పోటీకి దించలేదు. అక్షరాస్యతలో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్న కేరళలో ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం.