ఇక..ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌కు బైబై

దిశ, వెబ్ డెస్క్: ఇంటర్నెట్‌లో ప్రస్తుత తరానికి తెలిసిన వెబ్ బౌజర్లు..గూగుల్ క్రోమ్, ఫైర్‌ఫాక్స్. కానీ, ఓ రెండు దశాబ్దాలు వెనక్కి వెళితే..ఇంటర్నెట్ సేవలను ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చిన ఘనతను దక్కించుకున్న వెబ్‌ బ్రౌజర్‌గా ఎక్స్ఇంటర్నెట్ సేవలను ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చిన ఘనతను దక్కించుకున్న వెబ్‌ బ్రౌజర్‌గా ‘ఎక్స్‌ప్లోరర్’ నిలిచింది. 90వ దశకంలో అదో సంచలనమని చెప్పొచ్చు. ఆగస్టు, 1995లో విడుదలైన ‘ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్’ కేవలం ఆరు ఏండ్లలోనే ప్రపంచ పాపులర్ వెబ్ బ్రౌజర్‌గా సత్తా చాటింది. […]

Update: 2020-08-21 06:21 GMT

దిశ, వెబ్ డెస్క్: ఇంటర్నెట్‌లో ప్రస్తుత తరానికి తెలిసిన వెబ్ బౌజర్లు..గూగుల్ క్రోమ్, ఫైర్‌ఫాక్స్. కానీ, ఓ రెండు దశాబ్దాలు వెనక్కి వెళితే..ఇంటర్నెట్ సేవలను ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చిన ఘనతను దక్కించుకున్న వెబ్‌ బ్రౌజర్‌గా ఎక్స్ఇంటర్నెట్ సేవలను ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చిన ఘనతను దక్కించుకున్న వెబ్‌ బ్రౌజర్‌గా ‘ఎక్స్‌ప్లోరర్’ నిలిచింది. 90వ దశకంలో అదో సంచలనమని చెప్పొచ్చు. ఆగస్టు, 1995లో విడుదలైన ‘ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్’ కేవలం ఆరు ఏండ్లలోనే ప్రపంచ పాపులర్ వెబ్ బ్రౌజర్‌గా సత్తా చాటింది. 2003లో 95 శాతం యూజర్ వాటాతో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఉపయోగించే వెబ్ బ్రౌజర్‌గా నిలిచింది. అయితే ఫైర్‌ఫాక్స్, గూగుల్ క్రోమ్ సరికొత్త హంగులతో..లేటెస్ట్ బ్రౌజర్లుగా రావడంతో క్రమంగా ఎక్స్‌ప్లోరర్ తన యూజర్లను కోల్పోతూ వచ్చింది. ప్రస్తుతం ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ వాడే యూజర్లు వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. అందుకే మరికొన్ని రోజుల్లో ఎక్స్‌ప్లోరర్‌కు బైబై చెప్పనున్నట్లు మైక్రోసాఫ్ట్ స్పష్టం చేసింది.

ప్రస్తుతం కొనసాగుతున్న వెబ్ బ్రౌజర్లల్లో ఫైర్‌ఫాక్స్ 2004లో ఎంట్రీ ఇవ్వగా, గూగుల్ క్రోమ్ 2008లో బ్రౌజర్‌గా వచ్చింది. వీటి రాకతో అప్పటివరకు ఉన్న ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ తన ప్రాభావాన్ని కోల్పోయింది. ఆండ్రాయిడ్ మద్దతు ఇవ్వకపోవడంతో ఎక్స్‌ప్లోరర్‌ పోటీలో నిలవలేకపోయింది. దాంతో అది వెనకబడుతూ వచ్చింది. తాజాగా దాన్ని స్వస్తి పలుకుతున్నట్లుగా మైక్రోసాఫ్ట్ పేర్కొంది. 2021, ఆగస్టు 17 నుంచి ఆఫీస్‌ 365, వన్‌ డ్రైవ్‌, ఔట్‌లుక్‌ వంటివి ఎక్స్‌ప్లోరర్11కు సపోర్టు చేయవని తెలిపింది. దశలవారీగా దీని సేవలను నిలిపివేస్తామని స్పష్టం చేసింది. ఈ ఏడాది నవంబర్‌ 30 తర్వాత నుంచి తమ టీమ్‌ కూడా అందుబాటులో ఉండదని పేర్కొంది. అలాగే మార్చి 9, 2021 తరువాత నుంచి ఎడ్జ్‌ లెగస్సీ డెస్క్‌ టాప్‌ యాప్ కొత్త సెక్యూరిటీ అప్ డేట్స్ పొందలేదని స్పష్టం చేసింది. దీనికి బదులుగా కొత్త మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్‌ కొత్త విండోస్ ఫీచర్ అప్ డేట్స్‌తో అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఇక ఎక్స్‌ప్లోరర్ టాటా చెబుతుండటంతో..ఎక్స్ ప్లోరర్ వినియోగదారులు మరో బ్రౌజర్‌కు రాల్సిన అవసరముంది. ఎక్స్‌ప్లోరర్ ఉన్నా, లేకపోయినా ప్రజలకు ఇంటర్నెట్‌ను దగ్గర చేసిన ఘనత దీనికే దక్కుతుందనడంలో ఎలాంటి అనుమానం అక్కర్లేదు.

Tags:    

Similar News