మేనత్తనయ్యానంటూ మురిసిపోతున్న మాజీ మిస్ ఇండియా

దిశ, సినిమా: బాలీవుడ్ టెలివిజన్ నటి చారు అసోపా, మాజీ మిస్ ఇండియా సుస్మితా సేన్ సోదరుడు రాజీవ్‌ సేన్‌ దంపతులకు ఆడబిడ్డ జన్మించింది. ఈ శుభ సందర్భాన్ని బాలీవుడ్‌ హీరోయిన్‌, మాజీ మిస్‌ ఇండియా సుస్మితా సేన్‌ సోషల్‌ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకున్నారు. అంతేకాకుండా తాను మేనత్తనయ్యానంటూ సుస్మిత పట్టరాని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘దీపావళికి ముందే మా ఇంటికి మహాలక్ష్మి వచ్చింది. మా తమ్ముడు మరదలుకు ఆడపిల్ల పుట్టుంది’ అంటూ బేబీ […]

Update: 2021-11-01 09:48 GMT

దిశ, సినిమా: బాలీవుడ్ టెలివిజన్ నటి చారు అసోపా, మాజీ మిస్ ఇండియా సుస్మితా సేన్ సోదరుడు రాజీవ్‌ సేన్‌ దంపతులకు ఆడబిడ్డ జన్మించింది. ఈ శుభ సందర్భాన్ని బాలీవుడ్‌ హీరోయిన్‌, మాజీ మిస్‌ ఇండియా సుస్మితా సేన్‌ సోషల్‌ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకున్నారు. అంతేకాకుండా తాను మేనత్తనయ్యానంటూ సుస్మిత పట్టరాని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘దీపావళికి ముందే మా ఇంటికి మహాలక్ష్మి వచ్చింది. మా తమ్ముడు మరదలుకు ఆడపిల్ల పుట్టుంది’ అంటూ బేబీ ఫొటోలను షేర్‌ చేశారు.

అయితే ఈ ఫొటోల్లో బేబీ ముఖం కనిపించకుండా సుస్మిత జాగ్రత్త పడ్డారు. సుస్మిత పోస్ట్‌కు అసోపా-రాజీవ్‌లు స్పందిస్తూ.. ‘లవ్‌ యూ దీదీ. ఎట్టకేలకు మేనత్త ఫేవరేట్‌ వచ్చేసింది’ అంటూ అసోపా కామెంట్‌ చేయగా.. ‘నిజంగా ఇది శుభదినం, తొందరగా రండి అక్క మేం ముగ్గురం వేయిట్‌ చేస్తున్నాం’ అంటూ రాజీవ్‌ స్పందించాడు. అయితే గతేడాది జూలైలో వీరిద్దరూ విడాకులు తీసుకుని విడిపోతున్నట్లు ప్రకటించినా ఆ తర్వాత మనస్పర్థలు తొలగడంతో మళ్లీ ఒక్కటయ్యారు.

 

Tags:    

Similar News