నేను ఎన్నో సార్లు గాయపడ్డాను : ఈటల
దిశ,వెబ్ డెస్క్ : ప్రజల కన్నీళ్లను చూసి స్పందించినవాడే నిజమైన నాయకుడని ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఎన్నోసార్లు గాయపడినా తన మనసును, వ్యక్తిత్వాన్ని మాత్రం మార్చుకోలేనని తెలిపారు. తాను ఉన్నంత వరకు ప్రజల రుణం తీర్చుకుంటూనే ఉంటానని చెప్పారు. ధర్మం, న్యాయం తాత్కాలికంగా ఓడిపోయినా శాశ్వతంగా ఓడిపోదన్నారు. ఎవరైనా గుర్తు పెట్టుకోవాల్సింది కులం, డబ్బు పార్టీ జెండాను కాదు మనిషిని గుర్తుపెట్టుకోవాలన్నారు. అలాగే రాజకీయ నాయకుడంటే భారీ ఆకారం, ఆభరణాలు కాదు ప్రజల […]
దిశ,వెబ్ డెస్క్ : ప్రజల కన్నీళ్లను చూసి స్పందించినవాడే నిజమైన నాయకుడని ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఎన్నోసార్లు గాయపడినా తన మనసును, వ్యక్తిత్వాన్ని మాత్రం మార్చుకోలేనని తెలిపారు. తాను ఉన్నంత వరకు ప్రజల రుణం తీర్చుకుంటూనే ఉంటానని చెప్పారు. ధర్మం, న్యాయం తాత్కాలికంగా ఓడిపోయినా శాశ్వతంగా ఓడిపోదన్నారు. ఎవరైనా గుర్తు పెట్టుకోవాల్సింది కులం, డబ్బు పార్టీ జెండాను కాదు మనిషిని గుర్తుపెట్టుకోవాలన్నారు. అలాగే రాజకీయ నాయకుడంటే భారీ ఆకారం, ఆభరణాలు కాదు ప్రజల సమస్యల పట్ల స్పదించేవాడు నిజమైన నాయకుడన్నారు. మహాభారతంలో కౌరవులు, ధుర్యోధనుడు ఉండబట్టే పాండవులకు అంత పేరు వచ్చిందని ఈటల చెప్పారు.