‘స్వీయ తప్పిదమే.. కరోనా బాధితుడిని చేసింది’

ముంబయి: తనకు కరోనా పాజిటివ్ రావడం స్వయంకృత అపరాధమేనని మహారాష్ట్ర హౌజింగ్ మినిస్టర్ జితేంద్ర అవహద్ అన్నారు. కరోనా సోకకుండా తీసుకునే ముందు జాగ్రత్తలను పెడచెవిన పెట్టానని, ప్రజల సూచనలనూ ఖాతరు చేయలేదని తెలిపారు. పట్టింపులేని తెంపరితనంతో వ్యవహరించినందునే తనకు కరోనా వైరస్ సోకిందని వివరించారు. కొవిడ్ 19 మహారాష్ట్రలో వేగమందుకుంటున్న తరుణంలో మినిస్టర్ జితేంద్ర అవహద్ సహాయక పనుల్లో నిమగ్నయ్యారు. అనేక ప్రాంతాలకు తిరిగారు. ఈ నేపథ్యంలోనే తనకు కరోనా సోకింది. అయితే, వైరస్ నుంచి […]

Update: 2020-05-28 06:12 GMT

ముంబయి: తనకు కరోనా పాజిటివ్ రావడం స్వయంకృత అపరాధమేనని మహారాష్ట్ర హౌజింగ్ మినిస్టర్ జితేంద్ర అవహద్ అన్నారు. కరోనా సోకకుండా తీసుకునే ముందు జాగ్రత్తలను పెడచెవిన పెట్టానని, ప్రజల సూచనలనూ ఖాతరు చేయలేదని తెలిపారు. పట్టింపులేని తెంపరితనంతో వ్యవహరించినందునే తనకు కరోనా వైరస్ సోకిందని వివరించారు. కొవిడ్ 19 మహారాష్ట్రలో వేగమందుకుంటున్న తరుణంలో మినిస్టర్ జితేంద్ర అవహద్ సహాయక పనుల్లో నిమగ్నయ్యారు. అనేక ప్రాంతాలకు తిరిగారు. ఈ నేపథ్యంలోనే తనకు కరోనా సోకింది. అయితే, వైరస్ నుంచి కోలుకోవడంలో ఆత్మవిశ్వాసం కీలక పాత్ర పోషించిందని ఆయన వివరించారు. రెండు వారాల్లోనే వేగంగా కోలుకున్నారని తెలిపారు.

Tags:    

Similar News