ఇంకా తెల్లవారదేమీ.. ఈ చీకటి విడిపోదేమి?

దిశ, మహబూబ్‌నగర్: ఆగమేఘాల మీద రాగాలు తీశారు. కానీ, పాట అప్పుడే ఆపేశారు. దీంతో ఆశగా ఎదురు చూస్తున్నవారికి కరువు తప్పడంలేదు. కొందరికి మాత్రం అది వరంగా మారి అందలం ఎక్కుతున్నారు. అదేంటో మీరే చదవండి.. ప్రత్యేక కథనంలో.. మహబూబ్ నగర్ నిరుద్యోగులకు కోటి ఆశలు కల్పిస్తూ రాష్ర్ట ప్రభుత్వం రెండు సంవత్సరాల క్రితం జిల్లాకు ఐటీ పార్కును కేటాయించింది. స్వయంగా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఐటీ పార్కు పైలాన్ సైతం అవిష్కరించారు. […]

Update: 2020-03-20 01:13 GMT

దిశ, మహబూబ్‌నగర్: ఆగమేఘాల మీద రాగాలు తీశారు. కానీ, పాట అప్పుడే ఆపేశారు. దీంతో ఆశగా ఎదురు చూస్తున్నవారికి కరువు తప్పడంలేదు. కొందరికి మాత్రం అది వరంగా మారి అందలం ఎక్కుతున్నారు. అదేంటో మీరే చదవండి.. ప్రత్యేక కథనంలో..

మహబూబ్ నగర్ నిరుద్యోగులకు కోటి ఆశలు కల్పిస్తూ రాష్ర్ట ప్రభుత్వం రెండు సంవత్సరాల క్రితం జిల్లాకు ఐటీ పార్కును కేటాయించింది. స్వయంగా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఐటీ పార్కు పైలాన్ సైతం అవిష్కరించారు. ప్రస్తుతం ఈ పైలాన్ ఐటీపార్కును వెక్కిరించే పరిస్థితి నెలకుంది. 7-7-2018నాడు మంత్రి స్వయంగా జిల్లా కేంద్రానికి సమీపంలోని జాతీయ రహదారికి పక్కనే ఐటి పార్కు పైలాన్ ను అవిష్కరించారు. అదేవిధంగా గత అసెంబ్లీ సమావేశాల్లో దీని అభివృద్ధి కోసం ప్రభుత్వం బడ్జెట్లో రూ.48 కోట్లను కేటాయించింది. ఈ నిధులను పరిహారం కింద చెల్లించేందుకు విడుదల చేసినా కూడా నేటికి ఆ పనులు ఒక్క అడుగు కూడా ముందుకు సాగలేదు. ఈ పార్కు కోసం భూసేకరణ చేసిన అధికారులు కొంతమంది రైతులకు మాత్రమే ఇప్పటికే పరిహారం అందించారు కానీ, మరికొంత మందికి అందిచలేదు. అదే సమయంలో పార్కు అభివృద్ధి చేయాల్సిన అధికారులు ఇంతవరకూ ఈ ప్రాంతంలో లైటింగ్ పనులు, నీటి సౌకర్యం, మురుగు కాలువాల నిర్మాణం వంటి పనులను ముట్టుకోనేలేదు.

ఊసురుమంటున్నారు…

ఈ బడ్జెట్లో అయినా పెద్ద మొత్తంలో నిధులు కేటాయిస్తారని అందరు భావించారు. కానీ, అందరి అంచనాలను తలకిందులు చేస్తూ బడ్జెట్లో కనీసం ఈ పార్కు ఊసే లేకపోవడం అందరినీ అశ్చర్య పరిచింది. ఈ ఐటీ పార్కు ఏర్పాటు వల్ల జిల్లా వ్యాప్తంగా సుమారు లక్షమంది వరకు యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు కలుగుతాయని అప్పట్లో ప్రభుత్వ పెద్దలు ప్రకటించారు. అదే సమయంలో జాతీయ రహదారిపై వుండడం వల్ల కూడా వివిధ బహుళ జాతీ సంస్థలు ఇక్కడ కంపెనీలు పెట్టేందుకు కూడా ముందుకు వస్తాయని ప్రకటించారు. అలాగే జిల్లాలోని యువత ఇప్పటికే హైదరాబాద్, బెంగుళూరు, ముంబై వంటి మహానగరాల్లో ఉద్యోగం చేస్తున్న నేపథ్యంలో వారికి స్వంత జిల్లాలోనే ఉపాధి కల్పించే అవకాశం వుంటుందని పేర్కోన్నారు. మొత్తం మీద ప్రభుత్వం, అధికారులు ఎంతో ఆర్భటంగా ప్రారంభించిన ఐటీ పార్కు ముందుకు సాగకపోవడంతో జిల్లా యువత ఊసురుమంటున్నారు.

చెప్పనవసరం లేదు..

ఇదిలా వుండగా.. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల యువతకు, జిల్లా వాసులకు మేలు జరగకపోయినా రియల్ వ్యపారులకు మాత్రం వరంగా మారింది. ఐటీ పార్కును ప్రతిపాదించిన ప్రదేశానికి సమీపంలోనే ప్రభుత్వం నిర్మించిన 1024 డబ్బుల్ బెడ్ రూం ఇళ్ళ నిర్మాణం కూడా జరిగింది. దీంతో ఈ రెండింటి మద్యలో వున్న భూములతో పాటు చుట్టూ ఉన్న భూములపై రియల్ వ్యాపారుల కళ్ళు పడ్డాయి. అదే సమయంలో ఈ ప్రాంతంలో ఓ మంత్రికి సంబంధించినవారు కూడా ఆ భూములను ముందుగానే కొనుగోళ్ళు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఆ భూములను ప్లాట్లుగా మార్చి విక్రయిస్తున్నారు. గతంలో లక్షలో పలికే భూమి కాస్తా ప్రస్తుతం కోట్లలో పలుకుతుందంటే రియల్ వ్యాపారుల మాయాజాలం ఏ స్థాయిలో పనిచేస్తుందో ఆర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ప్రస్తుతం ఈ ప్రాంతంలో గజం భూమి విలువ కాస్తా అమాంతం రూ.5 వేల నుండి 8 వేలకు గజం పలుకుతుందంటే రియల్ వ్యాపారం స్థాయిలో సాగుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మొత్తానికి ఐటి పార్కు వల్ల యువతకు జిల్లా వాసులకు మేలు జరగకపోయినా.. కొంత మందికి మాత్రం బాగానే లాభం జరిగిందని చెప్పవచ్చు.

ఇటీవల మంత్రి కేటీఆర్ పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా పర్యటించిన సమయంలో కూడా ఐటీ పార్కు వల్ల జిల్లాకు లాభం జరుగుతుందని చెప్పారు తప్ప దాని పనులు ఎప్పటి నుండి ప్రారంభిస్తారు అనే విషయంలో మాత్రం టీఆర్ఎస్ నాయకులకు కూడా స్పష్టత లేకపోవడం గమనార్హం. ప్రస్తుత బడ్జెట్లో అయిన నిధులను ఎక్కువ సంఖ్యలో కేటాయించి పార్కు పనులను వేగవంతం చేస్తే జిల్లా వాసులకు మేలు జరుగుతుందని ప్రజలు అంటున్నారు. మరి ప్రభుత్వ పెద్దలు ఈ సారైన ఐటి పార్కుపై కరుణ చూపిస్తారో లేదా అనేది వేచి చూడాల్సిందే.

Tags: IT park, mahaboobnagar, budget,

Tags:    

Similar News