ఆ నిర్ణయం తెలంగాణ కార్మికులకు చేటు..

దిశ, వెబ్‌డెస్క్ : గల్ఫ్ కంట్రీస్‌లో కార్మికుల వేతనాలను 30 నుంచి 50 శాతం తగ్గించడంపై తెలంగాణ మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తప్పుబట్టారు. ఈ నిర్ణయం లక్షల మంది తెలంగాణ కార్మికులపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. కరోనా వలన దేశంలో విధించిన లాక్ డౌన్ వలన ఇప్పటికే చాలా మంది కూలీలు వేతనాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. ఈ విషయంపై కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ […]

Update: 2020-12-22 04:46 GMT

దిశ, వెబ్‌డెస్క్ : గల్ఫ్ కంట్రీస్‌లో కార్మికుల వేతనాలను 30 నుంచి 50 శాతం తగ్గించడంపై తెలంగాణ మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తప్పుబట్టారు. ఈ నిర్ణయం లక్షల మంది తెలంగాణ కార్మికులపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు.

కరోనా వలన దేశంలో విధించిన లాక్ డౌన్ వలన ఇప్పటికే చాలా మంది కూలీలు వేతనాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. ఈ విషయంపై కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ చర్యలు చేపట్టాలని ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్ కోరారు.

Tags:    

Similar News