T20 ప్రపంచకప్‌ రికార్డుకు 14 ఏళ్లు

దిశ, వెబ్‌డెస్క్: అది టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్. దాయాదులైన భారత్, పాకిస్తాన్ మధ్య రసవత్తర పోరు జరుగుతోంది. మ్యాచ్ చివరి దశకు వస్తున్నా.. కొద్ది ఆసక్తికరంగా మారింది. క్షణ క్షణం ఉత్కంఠంగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత్ సంచలన విజయం సాధించి, ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించింది. స్టేడియంలో అభిమానులు కేరింతలు. భారత ఆటగాళ్ల ముఖంలో ఆనందం. అప్పుడే ధోనీ స్టామినా ఏంటో ప్రపంచానికి కూడా తెలిసింది. భారత్ తొలి టీ20 ప్రపంచకప్‌ను ముద్దాడింది […]

Update: 2021-09-24 03:40 GMT

దిశ, వెబ్‌డెస్క్: అది టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్. దాయాదులైన భారత్, పాకిస్తాన్ మధ్య రసవత్తర పోరు జరుగుతోంది. మ్యాచ్ చివరి దశకు వస్తున్నా.. కొద్ది ఆసక్తికరంగా మారింది. క్షణ క్షణం ఉత్కంఠంగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత్ సంచలన విజయం సాధించి, ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించింది. స్టేడియంలో అభిమానులు కేరింతలు. భారత ఆటగాళ్ల ముఖంలో ఆనందం. అప్పుడే ధోనీ స్టామినా ఏంటో ప్రపంచానికి కూడా తెలిసింది. భారత్ తొలి టీ20 ప్రపంచకప్‌ను ముద్దాడింది కూడా అప్పుడే. 2007 సెప్టెంబర్ 24 క్రికెట్ ప్రేమికుల మనసులో నిలిచిపోయే రోజు అనడంలో ఎలాంటి సందేహం లేదు. నిజానికి మ్యాచ్ 20 ఓవర్లు అయినా ప్రతిఒక్కరూ అంతకుమించి ఫీల్ అయ్యారు. ప్రతీ ఆటగాడు అద్భుతంగా రాణించారు. ఎట్టకేలకు టీం ఇండియా సుదీర్ఘ ఎదురుచూపుకు బ్రేక్ చెప్పి విశ్వవిజేతగా నిలిచారు. ఈ కప్ గెలిచి నేటికి 14 ఏళ్లు వచ్చాయి. కాగా, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్​ చేసిన భారత్.. 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. ఛేదనలో పాక్.. వికెట్లన్నీ కోల్పోయి 152 పరుగులు మాత్రమే చేయగలిగింది.

Tags:    

Similar News