ఆ విద్యార్థులకు శుభవార్త.. అందులో భారీగా నియామకాలు
దిశ, వెబ్ డెస్క్: దేశంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. రోజూ 40 వేలకు చేరువలో కేసులు నమోదు అవుతూ, ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తోంది. వైరస్‌ను కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడంతో అనేక కంపెనీలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇప్పటికే అనేక కంపెనీలు ఉద్యోగులకు కూడా తీసివేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ విపత్కర పరిస్థితుల్లోనూ దిగ్గజ ఐటీ సంస్థ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఇంజనీరింగ్ విద్యార్థులకు శుభవార్త అందించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 15వేల నియామకాలను చేపట్టనున్నట్టు […]
దిశ, వెబ్ డెస్క్: దేశంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. రోజూ 40 వేలకు చేరువలో కేసులు నమోదు అవుతూ, ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తోంది. వైరస్‌ను కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడంతో అనేక కంపెనీలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇప్పటికే అనేక కంపెనీలు ఉద్యోగులకు కూడా తీసివేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ విపత్కర పరిస్థితుల్లోనూ దిగ్గజ ఐటీ సంస్థ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఇంజనీరింగ్ విద్యార్థులకు శుభవార్త అందించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 15వేల నియామకాలను చేపట్టనున్నట్టు ప్రకటించింది. కరోనావైరస్ టెక్ కంపెనీలను తీవ్రంగా దెబ్బతీసినప్పటికీ, బలమైన డిమాండ్, వృద్ధి అంచనాల నేపథ్యంలో ఫ్రెషర్లకు ఉద్యోగావకాశాల కల్పనకు మొగ్గుచూపుతున్నాయి. ఈ క్రమంలో హెచ్‌సీఎల్ కూడా క్యాంపస్ రిక్రూట్‌మెంట్లపై దృష్టి పెట్టింది. కరోనా సంక్షోభ సమయం కాబట్టి.. హెచ్‌సీఎల్ తన నియామకాలను వర్చువల్‌గా చేపట్టనుంది.