చీరపై రామాయణం.. వైరల్ అవుతున్న కొత్త ట్రెండీ డిజైన్

సాధారణంగా కథలు, కవితలు, జీవిత చరిత్రలు, పురాణ ఇతిహాసాలను పుస్తకాల్లో చదువుకుంటాం.

Update: 2025-03-27 03:30 GMT
చీరపై రామాయణం.. వైరల్ అవుతున్న కొత్త ట్రెండీ డిజైన్
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: సాధారణంగా కథలు, కవితలు, జీవిత చరిత్రలు, పురాణ ఇతిహాసాలను పుస్తకాల్లో చదువుకుంటాం. లేదా గూగుల్ ద్వారా తెలుసుకుంటాం. కానీ, మహిళలు కట్టుకునే చీరలపై చర్రితను ఎప్పుడైనా చూశారా? శ్రీకాళహస్తికి (Srikalahasti) చెందిన ఓ ఆర్టిస్ట్ చీరలపై చరిత్ర, పురాణాలు తదితర ఆసక్తికర విషయాలను అద్దుతూ చీరకు కొత్త అందాన్ని తీసుకువచ్చింది. అంతేకాదు, తన ఐడియాతో మరో 120 మందికి మహిళలకూ ఉపాధి కూడా కల్పించారు. మరీ ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాళహస్తికి చెందిన పాలూరి పద్మావతి (Paluri Padmavati) ఫ్యాషన్ డిజైనింగ్ పూర్తి చేసింది. ఈ క్రమంలో వస్త్రాలకు రసాయన రంగులు వాడటం వల్ల కలిగే హాని గురించి తెలుసుకుంది. వీటికి ప్రత్యామ్నాయంగా సేంద్రియ రంగుల అన్వేషణ మొదలుపెట్టింది. ఈ క్రమంలో పాలు, కరక్కాయ, బెల్లం, ఇనుప చువ్వలు.. వంటి వాటితో తీర్చిదిద్దే కలంకారీ ఆర్ట్‌ ఆమెను విపరీతంగా ఆకట్టుకుంటుంది. వాటి తయారీ నేర్చుకుని 2011లో శ్రీకాళహస్తిలో 'భానోదయ కలంకారీ' పేరిట బట్టల షాపును ప్రారంభించింది. తొలుత పద్మావతి పెట్టుబడి కేవలం రూ.20 వేలు మాత్రమే కావటంతో సాధారణ దుస్తువులనే రూపొందించేంది.

అయితే, తను రూపొందించే దుస్తువులకు తనదైన ప్రత్యేకత ఉండాలని కొత్త కొత్త ప్రయోగాలకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలోనే కంచిపట్టు చీరలపై భారతీయ సంస్కృతినీ, పలు రాష్ట్రాల ఆచార వ్యవహారాలనూ ప్రతిబింబించే బొమ్మల్ని చిత్రించింది. వీటిని రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రదర్శనల్లో ఉంచటం తక్కువ సమయంలోనే మంచి ఆదరణ లభించింది. ఇక అప్పటి నుంచి చీరలపై వైవిధ్యమైన డిజైన్లు అద్దుతూ తన ప్రత్యేకతను చాటుకుంటుంది. ఈ క్రమంలో గతేడాది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మొదటిసారి తిరుమలకు వస్తున్నారని తెలుసుకుని, ఆమె కోసం ప్రత్యేకమైన చీరను రూపొందించాలనుకుంది. ఈ నేపథ్యంలోనే 25 రోజులు కష్టపడి ఆమె జీవిత చరిత్రను ఇంగ్లిష్‌లో కంచి పట్టు చీరపై అద్ది బహుమతిగా అందజేసింది. ఆ తర్వాత ఆమెకు రాష్ట్రపతి భవన్‌లో జరిగిన 'వివిధతా కా అమృత్‌ మహోత్సవ్‌' కార్యక్రమంలో ఏపీ తరఫున పాల్గొనే అవకాశమూ వచ్చింది.

ఇక ఇటీవల నారా బ్రహ్మణి తిరుమల దర్శనార్థం వచ్చినప్పుడు కట్టుకున్న చీర సోషల్ మీడియాలో వైరల్ అయినా సంగతి తెలిసిందే. ఈ చీరను కూడా పద్మావతి డిజైన్ చేసింది. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి కోరిక మేరకు.. 35 రోజుల్లో కంచిపట్టు చీరపై రామాయణాన్ని తెలుగులో సీత, రాముల బొమ్మలతో అద్దింది. అయితే, ఆ చీర నెట్టింట వైరల్ అవ్వటంతో పద్మావతి కళ వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం పద్మావతి వద్ద 120 మంది మహిళలు పనిచేస్తూ ఉపాధి పొందుతున్నారు.

Read More..

ఈ అమ్మాయి కళకు హ్యాట్సాఫ్.. రామ్ పరివార్ ఎంత అద్భుతంగా గీసిందో చూడండి!  

Tags:    

Similar News