ఇన్ఫోసిస్ ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవులు
దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో విపరీతంగా పెరిగిపోతున్న కరోనా కేసుల నేపథ్యంలో పలు ఐటీ దిగ్గజ కంపెనీలు తమ ఉద్యోగులకు కొవిడ్ సంబంధిత పరిణామాల పట్ల చర్యలు తీసుకుంటున్నాయి. సెకెండ్ వేవ్ దారుణంగా ఉన్న కారణంగా ఉద్యోగుల ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తున్నాయి. తాజాగా దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఉద్యోగి ఎవరైనా కరోనా బారిన పడితే వారికి వేతనంతో కూడిన సెలవులను మంజూరు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు బెంగళూరు, పూణె నగరాల్లోని ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల […]
దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో విపరీతంగా పెరిగిపోతున్న కరోనా కేసుల నేపథ్యంలో పలు ఐటీ దిగ్గజ కంపెనీలు తమ ఉద్యోగులకు కొవిడ్ సంబంధిత పరిణామాల పట్ల చర్యలు తీసుకుంటున్నాయి. సెకెండ్ వేవ్ దారుణంగా ఉన్న కారణంగా ఉద్యోగుల ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తున్నాయి. తాజాగా దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఉద్యోగి ఎవరైనా కరోనా బారిన పడితే వారికి వేతనంతో కూడిన సెలవులను మంజూరు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు బెంగళూరు, పూణె నగరాల్లోని ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల కోసం ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ కొవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేసింది.
గ్రూప్ ఎంప్లాయిస్ ఇన్సూరెన్స్ ద్వారా ఉద్యోగులందరికీ కరోనా సంబంధిత వైద్య చికిత్సలను కవరేజ్ అందిస్తోంది. ఇన్ఫోసిస్ సంస్థ టెస్టింగ్ ల్యాబ్స్‌తో ఒప్పందం చేసుకోవడమే కాకుండా దేశంలోని కంపెనీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల కోసం 242 నగరాల్లోని మొత్తం 1,490 ఆసుపత్రుల యాజమాన్యంతో భాగస్వామ్యం చేసుకుంది. ఇన్ఫోసిస్ బాటలోనే క్యాప్‌జెమిని కూడా కరోనా వచ్చిన తమ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు కంపెనీ ద్వారా హెల్త్ ఇన్సూరెన్స్ వర్తించేలా చర్యలు తీసుకుంది. గతవారం విప్రో కూడా తమ ఉద్యోగులకు వ్యాక్సినేషన్ క్యాంప్ నిర్వహించిన సంగతి తెలిసిందే.