వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు పాసులు జారీ
దిశ, మెదక్: సంగారెడ్డి జిల్లాలోని వివిధ ప్రాంతాలలో రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తులను రవాణా చేసుకునేందుకు అవసరమైన పాసులు జారీ చేస్తామని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎం.హనుమంతరావు తెలిపారు. జిల్లా పరిధిలో గల ఆయా ప్రాంతాలకు చెందిన రైతులు తమ వ్వవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభించే చోటుకు రవాణా చేసుకోవడం కోసం అవసరమైన రవాణా పాసుల గురించి సంబంధిత స్థానిక రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్‌ను సంప్రదించాలని కలెక్టర్ హనుమంతరావు స్పష్టం చేశారు. లాక్‌డౌన్ సమయంలో ప్రభుత్వం […]
దిశ, మెదక్: సంగారెడ్డి జిల్లాలోని వివిధ ప్రాంతాలలో రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తులను రవాణా చేసుకునేందుకు అవసరమైన పాసులు జారీ చేస్తామని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎం.హనుమంతరావు తెలిపారు. జిల్లా పరిధిలో గల ఆయా ప్రాంతాలకు చెందిన రైతులు తమ వ్వవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభించే చోటుకు రవాణా చేసుకోవడం కోసం అవసరమైన రవాణా పాసుల గురించి సంబంధిత స్థానిక రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్‌ను సంప్రదించాలని కలెక్టర్ హనుమంతరావు స్పష్టం చేశారు. లాక్‌డౌన్ సమయంలో ప్రభుత్వం ప్రత్యేక సడలింపు చేసి జారీ చేస్తున్న వ్యవసాయ ఉత్పత్తుల రవాణా పాసులను అర్హులైన రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు హనుమంతరావు సూచించారు.
Tags; Issuing passes, transport, agricultural, produce, medak, collector