ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు

దిశ, ఏపీ బ్యూరో : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వైసీపీ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఉద్యోగులకు కొత్త డీఏ విడుదల చేసేందుకు ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఈ విషయాన్ని ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి తెలిపారు. వైసీపీ ప్రభుత్వం గతంలో విడుదల చేసిన షెడ్యూల్‌కు అనుగుణంగా 2022 జనవరి నుంచి డీఏను జీతానికి జమ చేయనున్నట్లు తెలిపారు. ఈ ప్రతిపాదనకు రాష్ట్ర ఆర్థికశాఖ ఆమోద ముద్ర వేస్తూ ఉత్తర్వులు జారీ […]

Update: 2021-12-20 09:27 GMT

దిశ, ఏపీ బ్యూరో : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వైసీపీ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఉద్యోగులకు కొత్త డీఏ విడుదల చేసేందుకు ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఈ విషయాన్ని ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి తెలిపారు. వైసీపీ ప్రభుత్వం గతంలో విడుదల చేసిన షెడ్యూల్‌కు అనుగుణంగా 2022 జనవరి నుంచి డీఏను జీతానికి జమ చేయనున్నట్లు తెలిపారు. ఈ ప్రతిపాదనకు రాష్ట్ర ఆర్థికశాఖ ఆమోద ముద్ర వేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ నిర్ణయంతో 2019, జూలై 1 నుంచి డీఏ వర్తించనుంది. దీంతో ఉద్యోగులు వచ్చే ఏడాది జనవరి నుంచి జీతంతో కలిపి ఈ డీఏ అందుకోనున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ఫెడరేషన్ తరపున వెంకట్రామిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

Tags:    

Similar News