హోం మంత్రి ఓటు చెల్లుతుందా…?
దిశ ప్రతినిధి , హైదరాబాద్ : రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ ఓటు వివాదంలో పడింది. మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో భాగంగా ఆదివారం ఉదయం ఆయన ఓల్డ్ మలక్ పేట లోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా మంత్రి బయటికి వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ తాను టీఆర్ఎస్ అభ్యర్థి వాణి దేవి కి ఓటు వేసినట్లు వెల్లడించారు. ఎన్నికల నియమావళి […]
దిశ ప్రతినిధి , హైదరాబాద్ : రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ ఓటు వివాదంలో పడింది. మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో భాగంగా ఆదివారం ఉదయం ఆయన ఓల్డ్ మలక్ పేట లోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా మంత్రి బయటికి వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ తాను టీఆర్ఎస్ అభ్యర్థి వాణి దేవి కి ఓటు వేసినట్లు వెల్లడించారు. ఎన్నికల నియమావళి ప్రకారం అధికారంలో ఉన్న ఓ అమాత్యులు ఇలా చెప్పడం నియమావళికి విరుద్ధం. దీంతో ఇప్పుడు ఆయన ఓటు చెల్లుతుందా? లేదా అనేది సందిగ్ధంలో పడింది. ఎన్నికల కమిషన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.