అలియాను రీప్లేస్ చేయలేరు!

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ డెత్.. బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ కెరియర్‌పై చాలా ఎఫెక్ట్ చూపించిందనేది వాస్తవం. అలియా లేటెస్ట్ ఫిల్మ్ ‘సడక్ 2’ భారీ డిస్‌లైక్స్‌తో ట్రెండ్ అవ్వడమే ఇందుకు ఉదాహరణ. దీంతో అలియా పని అయిపోయిందని, తను ఇప్పటికే సైన్ చేసిన సినిమాల దర్శక నిర్మాతలు భావిస్తున్నారని, తమ సినిమాలపై ‘సడక్ 2’ లాంటి ఎఫెక్ట్ పడకూడదని తన ప్లేస్‌లో మరో హీరోయిన్‌ను రీప్లేస్ చేస్తున్నారనే టాక్ వినిపించింది. ముఖ్యంగా ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న […]

Update: 2020-08-24 04:18 GMT

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ డెత్.. బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ కెరియర్‌పై చాలా ఎఫెక్ట్ చూపించిందనేది వాస్తవం. అలియా లేటెస్ట్ ఫిల్మ్ ‘సడక్ 2’ భారీ డిస్‌లైక్స్‌తో ట్రెండ్ అవ్వడమే ఇందుకు ఉదాహరణ. దీంతో అలియా పని అయిపోయిందని, తను ఇప్పటికే సైన్ చేసిన సినిమాల దర్శక నిర్మాతలు భావిస్తున్నారని, తమ సినిమాలపై ‘సడక్ 2’ లాంటి ఎఫెక్ట్ పడకూడదని తన ప్లేస్‌లో మరో హీరోయిన్‌ను రీప్లేస్ చేస్తున్నారనే టాక్ వినిపించింది.

ముఖ్యంగా ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’లోనూ అలియాకు బదులు ప్రియాంక చోప్రాను తీసుకుంటున్నట్టుగా వార్తలు వెలువడ్డాయి. అయితే ఇదంతా అబద్ధమని.. అలియా ఈ సినిమా కోసం ఇంకా స్పెషల్‌గా ప్రిపేర్ అవుతోందని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. తెలుగును అర్థం చేసుకోవడం, మాట్లాడటం కోసం తెలుగు భాష పాఠాలు నేర్చుకుంటున్నదని చెప్తున్నారు. కరోనా వల్ల ఇన్ని రోజులు షూటింగ్‌కు బ్రేక్ పడగా.. మంచి సమయం చూసి తిరిగి చిత్రీకరణ ప్రారంభించేందుకు మూవీ యూనిట్ వేచి చూస్తున్నట్టు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే, అలియా భట్ కీర్తికి భంగం కలిగించేందుకు కొందరు పనిగట్టుకుని ఇలాంటి ప్రచారం చేస్తున్నారని అంటున్నారు అభిమానులు. తన టాలెంట్ చూసే రాజమౌళి సెలెక్ట్ చేశారని.. తానే ఫీమేల్ లీడ్‌గా కొనసాగుతుందని చెబుతున్నారు.

Tags:    

Similar News