మగవాళ్లకు గర్భం.. ఇలా సాధ్యమే

దిశ, వెబ్‌డెస్క్ : ఈటీవీలో ప్రసారమయ్యే ఎక్స్‌ట్రా జబర్దస్త్ లేటెస్ట్ ఎపిసోడ్‌లో సుధీర్ టీమ్ ఒక మంచి స్కిట్ చేసింది. ఎప్పటిలా పక్కవాళ్లను దూషించకుండా.. తమపైనే ఆటో పంచ్‌లు వేసుకుంటూ ఆ స్కిట్ ద్వారా మంచి కుటుంబసహిత హాస్యాన్ని అందించారు టీమ్ సభ్యులు. అయితే ఈ స్కిట్‌లో కొత్తగా చూపించిన ఒక వైజ్ఞానిక అంశంపై కొంతమంది ఔత్సాహికులు పరిశోధన చేస్తుండటం విశేషం. అదేంటి.. ఒక కామెడీ షోలో వైజ్ఞానిక అంశం ఉండటం ఏంటని ఆశ్చర్యపోకండి. ఉంది.. అదే […]

Update: 2020-12-21 01:54 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఈటీవీలో ప్రసారమయ్యే ఎక్స్‌ట్రా జబర్దస్త్ లేటెస్ట్ ఎపిసోడ్‌లో సుధీర్ టీమ్ ఒక మంచి స్కిట్ చేసింది. ఎప్పటిలా పక్కవాళ్లను దూషించకుండా.. తమపైనే ఆటో పంచ్‌లు వేసుకుంటూ ఆ స్కిట్ ద్వారా మంచి కుటుంబసహిత హాస్యాన్ని అందించారు టీమ్ సభ్యులు. అయితే ఈ స్కిట్‌లో కొత్తగా చూపించిన ఒక వైజ్ఞానిక అంశంపై కొంతమంది ఔత్సాహికులు పరిశోధన చేస్తుండటం విశేషం. అదేంటి.. ఒక కామెడీ షోలో వైజ్ఞానిక అంశం ఉండటం ఏంటని ఆశ్చర్యపోకండి. ఉంది.. అదే మగవాళ్లకు గర్భం రావడం. దీని గురించి పెద్దగా వివరిస్తే కామెడీ స్కిట్‌ బోర్ కొట్టే అవకాశం ఉంది గనుక.. సన్నీ ఏదో ‘2002లో థామస్’ అంటూ కవర్ చేశాడు. మరి నిజంగానే థామస్ అనే వ్యక్తికి గర్భం వచ్చిందా? అసలు మగవాళ్లకు గర్భం రావడం సాధ్యమేనా? ఈ విషయాల గురించి చర్చించుకుందాం.

సహజంగా అయితే గర్భం పొందడానికి ఉపయోగపడే అవయవాలు ఆడవాళ్లలో మాత్రమే ఉంటాయి. కానీ సింగ్నథిడే (సీహార్స్) జాతికి చెందిన జీవుల్లో మాత్రం మగ జంతువులు కూడా గర్భాన్ని మోయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. జంతువుల సంగతి సరే.. మరి సుధీర్ స్కిట్‌లో చూపించినట్లుగా మగవాళ్లు గర్భం పొందగలరా? అంటే సైన్స్ పరంగా అవుననే చెప్పొచ్చు. అయితే క్షుణ్నంగా అర్థం చేసుకోవడానికి ఇది కాస్త సంక్లిష్టమైన సబ్జెక్ట్ కాబట్టి వీలైనంత తక్కువ తెలుసుకుని క్లారిటీ తెచ్చుకుంటే మంచిది. ఆస్ట్రేలియాలో ప్రభుత్వ మెడికేర్ డేటాను బట్టి చూస్తే మగవాళ్లు గర్భం పొంది, పిల్లలకు కూడా జన్మనిచ్చినట్లు రుజువులు ఉన్నాయి. 2009 వరకు ఇలాంటివి లేవు. కానీ ఇటీవల ఇలా గర్భం దాలుస్తున్న మగవాళ్ల సంఖ్య పెరిగింది. దీని గురించి మెల్‌బోర్న్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌ 2019లో సీహార్స్ అనే ఒక బీబీసీ డాక్యుమెంటరీ కూడా ప్రసారమైంది. ఈ డాక్యుమెంటరీలో 30 ఏళ్ల బ్రిటిష్ ట్రాన్స్‌జెండర్ వ్యక్తి ఫ్రెడ్డీ మెక్‌కానెల్ ఒక మగబిడ్డకు జన్మనివ్వడం కూడా చూపించారు.

దీన్ని బట్టి సాధారణ మగవాళ్లు.. అంటే పుట్టుకతోనే మగవాళ్లుగా గుర్తించబడి, మగవాళ్లుగానే జీవిస్తున్నవాళ్లలో గర్భం అసాధ్యం. కానీ సర్జరీ ద్వారా ట్రాన్స్‌జెండర్‌గా మారిన వాళ్లలో కొన్ని వైజ్ఞానిక ప్రక్రియల ద్వారా గర్భం సాధ్యమే. గర్భం ధరించడానికి కావాల్సింది గర్భసంచి. ఆపరేషన్ చేసి ఎవరైనా దానం చేసిన గర్భసంచిని గానీ, మూలకణాల ఆధారంగా ల్యాబ్‌లో తయారుచేసిన గర్భసంచిని గానీ మగవాళ్లలో పెట్టి, దాన్ని ప్లాజెంటాకు అనుసంధానించడం ద్వారా గర్భం దాల్చే ప్రక్రియను సులభతరం చేయవచ్చు. ఇలా గర్భం దాల్చినవాళ్లు చాలా మందే ఉన్నారు. అంతేకాకుండా ఇలాంటి యుటెరెస్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీకి ఇప్పుడు డిమాండ్ కూడా పెరుగుతోంది. చాలా దేశాల్లో స్వలింగ పెళ్లిళ్లను ఆమోదించడంతో అలా పెళ్లి చేసుకున్నవాళ్లందరూ ఈ సర్జరీ ద్వారా పిల్లలకు జన్మనిచ్చి మామూలు కుటుంబాల మాదిరిగా జీవనం కొనసాగిస్తున్నారు. దీనికి ముందు ఎక్టోపిక్ ఇంప్లాంటేషన్ అనే విధానం కూడా ఉండేది. కానీ ఈ విధానం ద్వారా అటు పేరెంట్ ఆరోగ్యం, ఇటు చైల్డ్ ఆరోగ్యం తీవ్రంగా ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. ఎక్టోపిక్ ఇంప్లాంటేషన్ విధానం ద్వారా గర్భం దాల్చవచ్చు కానీ బిడ్డకు జన్మనివ్వడం విజయవంతం కాదు.

అయితే ఇక్కడ ప్రధానంగా అర్థం చేసుకోవాల్సిన కాన్సెప్ట్ మరొకటి ఉంది. ఏఎంఏబీ, ఏఎఫ్ఏబీ పదాల మధ్య తేడా తెలియాలి. ఏఎంఏబీ అంటే ‘అసైన్డ్ యాజ్ మేల్ ఎట్ బర్త్’… పుట్టినప్పుడు మగవాళ్లుగా గుర్తించబడిన వాళ్లు, ఏఎఫ్ఏబీ అంటే ‘అసైన్డ్ యాజ్ ఫిమేల్ ఎట్ బర్త్’… పుట్టినప్పుడు ఆడవాళ్లుగా గుర్తించబడిన వాళ్లు. అయితే పుట్టినప్పుడు గుర్తించిన లింగం తర్వాత ఉండకపోవచ్చు. హార్మోన్లను బట్టి వారు ట్రాన్స్‌జెండర్‌లుగా మారవచ్చు. ఆ రకంగా ఏఎఫ్‌ఏబీ వ్యక్తులు యుక్తవయస్సు వచ్చేనాటికి మగవాళ్లుగా మారి, ట్రాన్స్‌జెండర్‌లు అయ్యే అవకాశం ఉంది. అయితే వీరు ఇప్పుడు మగవాళ్లుగా పరిగణించబడినప్పటికీ వారి శరీరంలో పుట్టుకతో ఉన్న గర్భసంచి అలాగే ఉంటుంది. దీని కారణంగా ఈ ట్రాన్స్‌జెండర్ మగవాళ్లు గర్భం దాల్చినట్లు పరిగణించవచ్చు. అలాగే ప్రస్తుతం ఉన్న వైజ్ఞానిక టెక్నాలజీల కారణంగా ఏఎంఏబీ మగవాళ్లు కూడా గర్భం దాల్చే అవకాశాలు మెండుగానే ఉన్నాయి. కాబట్టి సుధీర్ స్కిట్ పుణ్యమాని మనకు ఈ విషయాలు తెలుసుకునే అవకాశం వచ్చింది. అంతేకాకుండా ఇలాంటి సంక్లిష్ట కాన్సెప్ట్‌ను ప్రదర్శించినందుకు నిజంగా సుధీర్ గట్స్‌కు అభినందనలు తెలపాల్సిన అవసరం కూడా ఉంది.

Tags:    

Similar News