ఉప్పు ఎక్కువగా తింటే ప్రమాదకరమా ?

దిశ, వెబ్‌డెస్క్ : మనం వండుకునే ప్రతీ కూరలోను ఉప్పు వేసుకునే తింటాము. అసలు కూరలలో ఉప్పు లేకపోతే ఆ కూర రుచే ఉండదు. ఇక కొంత మంది కూరలో ఉప్పు ఎక్కువగా వేసుకొని తింటారు. మరికొందరు అసలు ఉప్పే ఎక్కువగా తినరు. అయితే ఉప్పు ఎక్కవగా తినడం వలన ఎలాంటి ఫలితం ఉంటుంది, తక్కువగా తినడం వలన ఎలాంటి ఫలితం ఉంటుదనే దానిపై పరిశోధకులు పరిశోధన చేశారు. ఈ ఖనిజాన్ని పరిశోధించిన శాస్త్రవేత్తలకు చిత్రమైన విషయాలు […]

Update: 2021-08-18 22:42 GMT

దిశ, వెబ్‌డెస్క్ : మనం వండుకునే ప్రతీ కూరలోను ఉప్పు వేసుకునే తింటాము. అసలు కూరలలో ఉప్పు లేకపోతే ఆ కూర రుచే ఉండదు. ఇక కొంత మంది కూరలో ఉప్పు ఎక్కువగా వేసుకొని తింటారు. మరికొందరు అసలు ఉప్పే ఎక్కువగా తినరు. అయితే ఉప్పు ఎక్కవగా తినడం వలన ఎలాంటి ఫలితం ఉంటుంది, తక్కువగా తినడం వలన ఎలాంటి ఫలితం ఉంటుదనే దానిపై పరిశోధకులు పరిశోధన చేశారు. ఈ ఖనిజాన్ని పరిశోధించిన శాస్త్రవేత్తలకు చిత్రమైన విషయాలు తెలిశాయి. ఆ వివరాలు తెలుసుకుందాం.

అయితే ఎక్కువగా ఉప్పు తింటే, మెదడులో మంట, నొప్పి, దురదల వంటివి వచ్చేలా చేస్తుందని నిపుణులు తెలిపారు. ఎలుకలపై ప్రయోగం చేయగా ఎక్కువగా ఉప్పుతీసుకున్న ఎలుకలు పిచ్చిగా ప్రవర్తించాయని, సరిపడ ఉప్పు తిన్న ఎలుకలు మాత్రం మాములుగా ఉన్నాయని వారు తేల్చారు. దీని బట్టి ఉప్పు ఎక్కువగా కాకుండా సరిపడ తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భూ వాతావరణంలో ఉప్పుని చల్లితే చాలు, అది వాతావరణాన్ని చల్లగా చేస్తుంది. భూతాపాన్ని తగ్గిస్తుంది. కానీ, ఇది భూమిపై ఉన్న ట్రోపోస్పియర్, స్ట్రాటోస్పియర్‌లను నాశనం చెయ్యగలదు. అందువల్ల భూమిపై వేడిని తగ్గించేందుకు ఉప్పును చల్లడం సరైన పద్ధతి కాదని పరిశోధకులు తెలిపారు. అంతే కాకుండా కుక్క కరవగానే ఉప్పునీటితో కడిగితే ఇన్ఫెక్షన్లు రావని పరిశోధనలో తేలింది. సాల్ట్ ఫుడ్స్‌ను ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. వేసవిలో మీ శరీరం తేమగా ఉండాలంటే, రెగ్యులర్ డైట్ నుండి ఉప్పును పూర్తిగా నివారిచాలని చెప్తున్నారు. ఉప్పును తక్కువగా తీసుకోవడం వల్ల మీ బ్లడ్ ప్రెజర్‌ను కంట్రోల్లో ఉంచుతుంది. ఇది శరీరంలో ఒత్తిడిని, ఆందోళనను తగ్గిస్తుంది.

 

 

Tags:    

Similar News