ఇర్ఫాన్… నాకు కోపం వస్తోంది.. భార్య భావోద్వేగం
అంతర్జాతీయ స్థాయి నటుడు ఇర్ఫాన్ ఖాన్ మరణాన్ని అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. తెరమీద తన అద్భుత నటనను చూసి ఆనందించే అవకాశం కోల్పోయామనే భావన కన్నీరు తెప్పిస్తోంది. ఈ సమయంలో ఇర్ఫాన్ భార్య సుతప భావోద్వేగంతో కూడిన పోస్ట్ … హృదయాన్ని ద్రవించేస్తోంది. నాకు అతని మీద చాలా కోపంగా ఉంది… నా జీవితాన్ని సాధారణంగా ఉండనివ్వడం లేదు అంటూ పెట్టిన పోస్ట్ కంటతడి పెట్టిస్తోంది. “ఇది ఫ్యామిలీ స్టేట్మెంట్ అని ఎలా రాయను.. ఇర్ఫాన్ చనిపోవడాన్ని […]
అంతర్జాతీయ స్థాయి నటుడు ఇర్ఫాన్ ఖాన్ మరణాన్ని అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. తెరమీద తన అద్భుత నటనను చూసి ఆనందించే అవకాశం కోల్పోయామనే భావన కన్నీరు తెప్పిస్తోంది. ఈ సమయంలో ఇర్ఫాన్ భార్య సుతప భావోద్వేగంతో కూడిన పోస్ట్ … హృదయాన్ని ద్రవించేస్తోంది. నాకు అతని మీద చాలా కోపంగా ఉంది… నా జీవితాన్ని సాధారణంగా ఉండనివ్వడం లేదు అంటూ పెట్టిన పోస్ట్ కంటతడి పెట్టిస్తోంది.
“ఇది ఫ్యామిలీ స్టేట్మెంట్ అని ఎలా రాయను.. ఇర్ఫాన్ చనిపోవడాన్ని ప్రపంచం మొత్తం వ్యక్తిగత నష్టంగా భావిస్తున్నప్పుడు. నేను ఒంటరినని ఎలా చెప్పగలను ప్రపంచం మొత్తం నాతో పాటు ఆయన కోసం రోదిస్తున్నప్పుడు. కానీ ఇది నష్టం కాదు.. లాభం అని అందరికీ భరోసా ఇవ్వాలని వచ్చాను. ఇర్ఫాన్ మనకు నేర్పిన విషయాలను ఇప్పుడు నిజంగా అమలు చేయడం, అభివృద్ధి చేయడం ప్రారంభిస్తాం. అంతే కాదు ఈ సమయంలో ప్రజలకు తెలియని కొన్ని విషయాలను తెలిపేందుకు ప్రయత్నిస్తున్నాను.
ఇది నమ్మశక్యం కానీ విషయం. ఇర్ఫాన్ మాటల్లో చెప్తాను అంటూ ప్రారంభించిన సుతప… జీవితాన్ని ఒక మాయాజాలంగా అభివర్ణించారు. ఇర్ఫాన్ వన్ డైమెన్షన్స్ రియాలిటీ ని ఎప్పుడూ ప్రేమించలేదన్నారు. ఒక్క విషయం నాకు ఆయనపై కోపం తెస్తోంది. ఆయన నన్ను నాశనం చేశారు. పరిపూర్ణత కోసం ఆయన చేసిన పని ఏ విషయంలోనూ నన్ను సాధారణంగా ఉండనివ్వలేదు. ఆయన చూసే విధానంలో ఒక రిథమ్ ఉంటుంది. కాబట్టి ఆ రిథమ్ కు తగినట్లుగా రెండు ఎడమ పాదాలు, చెవిటి స్వరంతో పాడడం, డ్యాన్స్ చేయడం ప్రారంభించా. ఫన్నీగా మా జీవితం యాక్టింగ్ లో మాస్టర్ క్లాస్ అయిపొయింది. ఆహ్వానించని అతిథులు వచ్చేశారు. అప్పుడు కాకోఫోనిలో హార్మొనీ చూడడం నేర్చుకున్నా. డాక్టర్స్ రిపోర్ట్స్ నేను పరిపూర్ణంగా కోరుకునే స్క్రిప్ట్ లు అయిపోయాయి.. ఈ ప్రయాణంలో చాలా మంది గొప్ప డాక్టర్లను చూసాను అని వారికి ధన్యవాదాలు తెలిపిన సుతప… ఈ రెండున్నరేళ్ల ప్రయాణం ఒక అంతరాయంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఆర్కెస్ట్రా కండక్టర్ ఇర్ఫాన్ అధికారంలో ప్రారంభమైన ఈ 35 ఏళ్ల ప్రయాణం.. మా సహవాసం నుంచి వేరు చేసింది. మాది వివాహం కాదు… ఒక యూనియన్ అని తెలిపారు సుతప.
ఇప్పుడు నా కుటుంబాన్ని ఒక పడవగా చూస్తున్నాను.. వాళ్ల తండ్రి గైడెన్స్ తో నా కొడుకులు ఇద్దరు బాబిల్, అయాన్ ఆ పడవను ముందుకు నడిపిస్తారు అనుకుంటున్నాను. కానీ జీవితం సినిమా కాదు, రీ టేక్స్ ఉండవు కాబట్టి సురక్షితంగా నడపాలని కోరుకుంటున్నా.
నా పిల్లల్ని అడిగాను వాళ్ల తండ్రి నుంచి ఏం నేర్చుకున్నారు అని…. ఈ విధంగా చెప్పారు.
బాబీ: అనిశ్చితి చేసే నృత్యానికి లొంగిపోయి విశ్వం పై విశ్వాసం ఉంచాలి
ఆర్యన్ : మీ మనసును మీరు నియంత్రించాలి… అది మిమ్మల్ని నియంత్రించకూడదు.
విజయవంతమైన ప్రయాణం పూర్తి అయ్యాక ఇర్ఫాన్ ను తనకు ఇష్టమైన ప్లేస్ లో రాట్ కి రాణి చెట్టు దగ్గర ఉంచాం. ఆ చెట్టు వికసించి, సువాసన వెదజల్లేందుకు సమయం పడుతుంది. ఆ తర్వాత తన అభిమానుల ఆత్మలను తాకుతుంది అని నమ్ముతున్నా.
Tags: Irfan Khan Wife Emotional post, Irfan Khan Wife sutapa sikdar, sutapa sikdar post, sutapa sikdar irfan khan