అంతా రహస్యం.. సెక్రటరీకి తెలియకుండానే కొత్త కాలేజీలకు అనుమతి!
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా దొడ్డి దారిలో కొత్త పార మెడికల్కాలేజీలు రాబోతున్నట్లు ఆ విభాగంలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. బోర్డు కార్యదర్శికి తెలియకుండానే హై పవర్ కమిటీ దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రైవేట్కాలేజీల యాజమాన్యాలు హై పవర్ కమిటీతో రహస్య ఒప్పందాలు కుదుర్చుకొని, అనుమతులు కొరకు ఆశ్రయిస్తున్నట్లు బోర్డులోని కొందరు అధికారులు అప్ది రికార్డులో చెబుతున్నారు. ఇదే విషయాన్ని బోర్డు సెక్రటరీ ప్రేమ్ కుమార్‌ను ‘దిశ’ ప్రతినిధి సంప్రదించగా కొత్త అప్లికేషన్లు […]
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా దొడ్డి దారిలో కొత్త పార మెడికల్కాలేజీలు రాబోతున్నట్లు ఆ విభాగంలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. బోర్డు కార్యదర్శికి తెలియకుండానే హై పవర్ కమిటీ దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రైవేట్కాలేజీల యాజమాన్యాలు హై పవర్ కమిటీతో రహస్య ఒప్పందాలు కుదుర్చుకొని, అనుమతులు కొరకు ఆశ్రయిస్తున్నట్లు బోర్డులోని కొందరు అధికారులు అప్ది రికార్డులో చెబుతున్నారు. ఇదే విషయాన్ని బోర్డు సెక్రటరీ ప్రేమ్ కుమార్‌ను ‘దిశ’ ప్రతినిధి సంప్రదించగా కొత్త అప్లికేషన్లు తీసుకునే విషయం తనకు తెలియదని సమాధానం ఇచ్చారు. అయినా నోటిఫికేషన్లేకుండా హై పవర్ కమిటీ దరఖాస్తులను ఎలా స్వీకరిస్తోంది? అని ఆయన కూడా ఆశ్చర్యానికి గురయ్యారు.
ఉన్న కాలేజీలకు ఆదరణ తక్కువే…
రాష్ర్ట వ్యాప్తంగా ప్రైవేట్‌లో 200లకు పైగా పారామెడికల్కాలేజీలు ఉన్నాయి. వీటిలో పది వేలకు పైగా సీట్లు ఉండగా, ప్రతీ ఏటా 3 నుంచి 4 వేల సీట్లు ఖాళీగానే ఉంటున్నాయి. వీటిలో సుమారు 100 పైగా కాలేజీలకు ప్రభుత్వం నుంచి అనుమతి లేదు. కేవలం పారామెడికల్బోర్డు గతంలో దొడ్డి దారిన ఇచ్చిన అనుమతులతోనే నడుస్తున్నాయి. బోర్డు ఇచ్చిన అనుమతి చెల్లదంటూ ఆయా కాలేజీల గుర్తింపును 2019లోనే సెక్రటరీ రద్దు చేశారు. ఈ విషయాన్ని మరువకముందే కొత్త పారమెడికల్కాలేజీల కోసం హై పవర్కమిటీ అప్లికేషన్లు తీసుకోవడమేమిటనీ బోర్డులోని కొందరు అధికారులు ప్రశ్నిస్తున్నారు. అందుబాటులో ఉన్న కాలేజీలకే ఆదరణ లేనప్పుడు కొత్త కాలేజీలు ఎందుకని బోర్డులోని కొందరు అధికారులు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. హై పవర్ కమిటీతో రహస్య ఒప్పందంలో భాగంగా భారీ స్థాయిలో ముడుపులు చేతులు మారినట్టు ఆరోపణలూ వస్తున్నాయి.
తప్పుడు నిర్ధారణ…
డయాగ్నస్టిక్ విభాగానికి సంబంధించిన కోర్సులన్నీ పారమెడిక్కాలేజీల్లోనూ నేర్చుకోవాల్సి ఉంటుంది. అయితే కొంత మంది ప్రైవేట్యాజమాన్యాలు కాసులకు కక్కుర్తి పడి సరైన శిక్షణ ఇవ్వకుండానే కోర్సు పూర్తయినట్టు ప్రకటిస్తున్నారు. దీంతో సదరు విద్యార్థుల్లో నైపుణ్యత లోపిస్తున్నది. ఫలితంగా నిర్ధారణ పరీక్షలను సమర్ధవంతగా చేయలేకపోతున్నారు. గతంలో ఇలాంటి సంఘటనలను గుర్తించిన ప్రభుత్వం ప్రైవేట్ పారమెడికల్కాలేజీల్లో విచారణ కూడా చేపట్టింది.