ధాన్యం కొనుగోలులో అక్రమాలు.. స్పందించిన ఎమ్మెల్యే
దిశ, రంగారెడ్డి: జిల్లాలో పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలల్లో అక్రమాలు జరుగుతున్నాయి. విషయం ఎమ్మెల్యేకు తెలియడంతో తానే స్వయంగా కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. యాలాల్ మండలం పగిడియాల్ గ్రామంలోని డీసీఎంఎస్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో గత 15 రోజుల నుంచి అవకతవకలు జరుగుతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం 40 కిలోలకు 600 గ్రాముల తూకం ఒక బస్తాకు వేయాలి. కానీ దీనికి విరుద్ధంగా […]
దిశ, రంగారెడ్డి: జిల్లాలో పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలల్లో అక్రమాలు జరుగుతున్నాయి. విషయం ఎమ్మెల్యేకు తెలియడంతో తానే స్వయంగా కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. యాలాల్ మండలం పగిడియాల్ గ్రామంలోని డీసీఎంఎస్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో గత 15 రోజుల నుంచి అవకతవకలు జరుగుతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం 40 కిలోలకు 600 గ్రాముల తూకం ఒక బస్తాకు వేయాలి. కానీ దీనికి విరుద్ధంగా 41 కిలోలకు 500 గ్రాముల తూకం వేస్తూ ఒక్కొక్క బస్తాకు కిలో నుంచి రెండు కిలోల వరకు రైతుల నుంచి దోచుకొని పబ్బం గడుపుతున్నారు కొందరు అక్రమార్కులు. ఈ విషయం వెలుగులోకి రావడంతో తాండూర్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి స్పందించి పగిద్యల్ కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ధాన్యం కొనుగోలులో జరుగుతున్న అవకతవకలపై ఆరా తీశారు. ఈ తంతు వెనకాల ఒక బడా నాయకుడు ఉన్నాడని స్థానికుల సమాచారం. దీనికి బాధ్యులైన పాండు(డిపో ఇంచార్జ్), షరీఫ్(డీసీఎంఎస్ మేనేజర్) లపై కటిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. రైతులకు జరిగిన నష్టాన్ని రెండు రోజులలో తిరిగి చెల్లించకపోతే పాండు, షరీఫ్ లను సస్పెండ్ చేసి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తానని ఎమ్మెల్యే హెచ్చరించారు.