గ్యాంగ్‌స్టర్ అయితేనే బెడ్ దొరుకుతుందా..? : ఇర్ఫాన్ వైఫ్

దిశ, సినిమా : లెజెండరీ యాక్టర్ లేట్ ఇర్ఫాన్ ఖాన్ వైఫ్ సుతాప సిక్‌దర్ పోస్ట్‌ వైరల్ అయింది. తన ఫ్యామిలీ ఫ్రెండ్ సమీర్ బెనర్జీ కరోనాతో చనిసోయిన దయనీయ స్థితి గురించి వివరించిన ఆమె.. గవర్నమెంట్‌పై ఇండైరెక్ట్‌గా కామెంట్ చేసింది. దేశ రాజధాని ఢిల్లీలో కరోనా ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్‌లో ఐసీయూ బెడ్ కూడా సంపాదించలేక పోవడంతో సమీర్‌ను కోల్పోయామని ఎమోషనల్ నోట్ పెట్టింది. కానీ ‘కరోనా కారణంగా ఢిల్లీలో అల్లకల్లోలం.. సమీర్ దాస్ స్మైల్.. […]

Update: 2021-05-03 03:37 GMT

దిశ, సినిమా : లెజెండరీ యాక్టర్ లేట్ ఇర్ఫాన్ ఖాన్ వైఫ్ సుతాప సిక్‌దర్ పోస్ట్‌ వైరల్ అయింది. తన ఫ్యామిలీ ఫ్రెండ్ సమీర్ బెనర్జీ కరోనాతో చనిసోయిన దయనీయ స్థితి గురించి వివరించిన ఆమె.. గవర్నమెంట్‌పై ఇండైరెక్ట్‌గా కామెంట్ చేసింది. దేశ రాజధాని ఢిల్లీలో కరోనా ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్‌లో ఐసీయూ బెడ్ కూడా సంపాదించలేక పోవడంతో సమీర్‌ను కోల్పోయామని ఎమోషనల్ నోట్ పెట్టింది. కానీ ‘కరోనా కారణంగా ఢిల్లీలో అల్లకల్లోలం.. సమీర్ దాస్ స్మైల్.. అతను గ్యాంగ్‌స్టర్ చోటా రాజన్ కాదు కాబట్టి హాస్పిటల్‌లో బెడ్ పొందలేకపోవడం..’ ఈ మూడు విషయాలను మాత్రం ఎప్పటికీ మరిచిపోలేనని ఆవేదన వ్యక్తం చేసింది. బెనర్జీలు, షేక్‌లు, దాస్‌లు అందరూ పోవాల్సిందే.. ఒక దేశంగా ముస్లిం, హిందువుల పండుగలపై దృష్టిసారించే బదులు.. హాస్పిటల్స్‌లో ఆక్సిజన్ ప్లాంట్స్‌పై కాన్సంట్రేట్ చేసి ఉంటే వీరందరూ మరికొంత కాలం మనతో ఉంటారు కదా! అని అభిప్రాయం వ్యక్తం చేసింది సుతాప. ఈ కష్ట కాలంలో కరోనా వారియర్స్ సాయం మరిచిపోలేమన్న సుతాప.. ధన్యవాదాలు తెలిపింది. వారికి తన ఆశీర్వాదాలు ఎప్పటికీ ఉంటాయని చెప్పింది.

Tags:    

Similar News