వీడెక్కడి మొగుడండీ బాబు : ఐపీఎస్‌కు తప్పని వరకట్న వేధింపులు
దిశ,వెబ్‌డెస్క్ : ఆడపిల్లల్ని మంచి కాలేజీలో చదవించకపోతే చదువు పాడవుతుంది. మంచి ఇంటికి పంపకపోతే జీవితమే పాడవుతుంది. ధర్మార్ధ కామ మోక్షాల్లో తోడుగా ఉంటామని ప్రమాణం చేస్తున్న వాళ్లే ప్రమాదకరంగా మారుతున్నారు. పురుషాహంకారంతో విర్రవీగుతూ కట్టుకున్న భార్యలకు కాలయముళ్లలా మారుతున్నారు. వరకట్నం వేదింపులు, గృహహింస చట్టాలున్నా మృగాళ్ల తీరుమారడం లేదు. ఆ అల్లుడు కూడా అలాంటి వాడే. కష్టపడితే ఏమోస్తుంది ఒట్టినొప్పులు తప్ప అని భావించాడు. కట్టుకున్న భార్యను, అత్తింటి వాళ్లను పీడిస్తే కాసులు రాలుతాయని అనుకున్నాడు. […]
దిశ,వెబ్‌డెస్క్ : ఆడపిల్లల్ని మంచి కాలేజీలో చదవించకపోతే చదువు పాడవుతుంది. మంచి ఇంటికి పంపకపోతే జీవితమే పాడవుతుంది. ధర్మార్ధ కామ మోక్షాల్లో తోడుగా ఉంటామని ప్రమాణం చేస్తున్న వాళ్లే ప్రమాదకరంగా మారుతున్నారు. పురుషాహంకారంతో విర్రవీగుతూ కట్టుకున్న భార్యలకు కాలయముళ్లలా మారుతున్నారు. వరకట్నం వేదింపులు, గృహహింస చట్టాలున్నా మృగాళ్ల తీరుమారడం లేదు. ఆ అల్లుడు కూడా అలాంటి వాడే. కష్టపడితే ఏమోస్తుంది ఒట్టినొప్పులు తప్ప అని భావించాడు. కట్టుకున్న భార్యను, అత్తింటి వాళ్లను పీడిస్తే కాసులు రాలుతాయని అనుకున్నాడు. కానీ చివరికి ఏమైంది?
ఐఎఫ్ఎస్ భర్తపై ఐపీఎస్ భార్య ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడంటూ ఫిర్యాదులో పేర్కొంది. దీంతో పోలీసులు మొత్తం ఏడుగురిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
కర్ణాటక పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న ఐపీఎస్ అధికారిణి వర్తిక కటియార్ కు, భారత రాయబార కార్యాలయంలో పనిచేసే అధికారి నితిన్ సుభాష్ కు 2011లో మహరాష్ట్రాలోని భూసావాల్ లో వివాహం జరిగింది. వర్తిక తల్లిదండ్రులే భారీ ఎత్తున ఖర్చు పెట్టి పెళ్లి జరిపించారు. అయితే పెళ్లి జరిగిన కొద్దిరోజుల తరువాత భర్త నితిన్ తన శాడిజాన్ని వర్తిక పై చూపించేవాడు. వరకట్నం కోసం కట్టుకున్న భార్యను తల్లిదండ్రులతో కలిసి చిత్రహింసలకు గురిచేసేవాడు. కారణం లేకుండానే ధూషించేవారు. అసభ్యంగా ప్రవర్తించేవారు. ఆ ఇన్సిడెంట్ జరిగిన మూడు నెలల తరువాత అదనంగా కట్నం ఇవ్వాలని, లేదంటే విడాకులు ఇస్తానని భర్త బెదిరించాడు. దీంతో భయాందోళనకు గురైన బాధితురాలు చేసేది లేక రూ.3లక్షలు ఇచ్చింది. పెళ్లైన సంవత్సరం తరువాత అంటే 2012 లో నిందితుడు రహస్యంగా యూపీలో ఉంటున్న భార్య వర్తిక అమ్మమ్మ నుంచి రూ.5లక్షలు తీసుకున్నాడు. ఆ డబ్బులు గురించి అడిగిన వర్తికకు చెక్ ఇచ్చాడు. ఆ చెక్ బౌన్స్ అయ్యింది. దీంతో తన భర్త రూ.5లక్షలు చెల్లించలేడని అమ్మమ్మని బ్రతిమలాడింది. కానీ కసాయి భర్త భార్యకపై కనికరం చూపించలేదు. పైగా ఇంకా వేధింపులు ఎక్కువయ్యాయి. 2016 లో వర్తిక- నితిన్ లు కొలంబో వెళ్లారు. అక్కడ నితిన్ తన భార్య వర్తికపై ఐస్ గడ్డలతో దాడి చేశాడు. ఈ దాడిలో బాధితురాలి చేయి విరిగింది. ఆ తరువాత కొత్తిల్లు కొనుక్కోవాలంటూ రూ.35లక్షలు కట్నంగా డిమాండ్ చేశారు.
దీంతో నిందితుడి ఆగడాల్ని తట్టుకోలేని ఎస్పీ వర్తిక కబ్బన్ పార్క్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఓ సీనియర్ పోలీస్ అధికారి మాట్లాడుతూ ఈ కేసు గురించి తెలుసుకుంటున్నామని, ఇప్పటి వరకు ఎవరినీ తాము ప్రశ్నించలేదన్నారు. వేధింపులు ఢిల్లీలో జరిగాయి కాబట్టి కేసును అక్కడికి బదిలీ చేయాలని నిర్ణయించుకుంన్నట్లు సదరు పోలీస్ అధికారి వెల్లడించారు.