బిగ్ బ్రేకింగ్ : IPS ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా
దిశ, తెలంగాణ బ్యూరో :తెలంగాణ సోషల్ వెల్ఫేర్ గురుకులాల కార్యదర్శి, ఐపీఎస్ అధికారి ఆర్‌ఎస్ ప్రవీన్ కుమార్ రాజీనామా చేశారు. ఐపీఎస్‌తో పాటుగా గురుకులాల కార్యదర్శి పదవికి రాజీనామా చేస్తున్నట్లు సీఎస్‌కు లేఖ పంపించారు. 26 ఏండ్లుగా వివిధ హోదాల్లో పని చేశానని, ఇంకా ఆరేండ్ల సర్వీసు ఉన్నప్పటికీ వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. ఇంతకాలం తాను పనిచేసిన కాలం ఎలాంటి సంతృప్తిని ఇచ్చిందనే విషయాన్ని ప్రస్తావించకుండా ఇకపైన తన మనుసుకు నచ్చిన విధంగా […]
దిశ, తెలంగాణ బ్యూరో :తెలంగాణ సోషల్ వెల్ఫేర్ గురుకులాల కార్యదర్శి, ఐపీఎస్ అధికారి ఆర్‌ఎస్ ప్రవీన్ కుమార్ రాజీనామా చేశారు. ఐపీఎస్‌తో పాటుగా గురుకులాల కార్యదర్శి పదవికి రాజీనామా చేస్తున్నట్లు సీఎస్‌కు లేఖ పంపించారు. 26 ఏండ్లుగా వివిధ హోదాల్లో పని చేశానని, ఇంకా ఆరేండ్ల సర్వీసు ఉన్నప్పటికీ వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. ఇంతకాలం తాను పనిచేసిన కాలం ఎలాంటి సంతృప్తిని ఇచ్చిందనే విషయాన్ని ప్రస్తావించకుండా ఇకపైన తన మనుసుకు నచ్చిన విధంగా ఇష్టమైన పనులను చేసుకునేందుకే రాజీనామా చేస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు. రాజీనామా తర్వాత మహాత్మ జ్యోతిరావుపూలే, బాబాసాహెబ్ అంబేద్కర్, కాన్సీరాం మార్గంలో నడుస్తానని, భావి తరాలను కొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తానని ప్రవీణ్ కుమార్ వెల్లడించారు.