‘షెడ్యూల్ ప్రకారమే ఐపీఎల్’

స్పోర్ట్స్ : బీసీసీఐ (BCCI) గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) జరుగుతుందని బోర్డు కోశాధికారి అరుణ్ ధుమాల్ వెల్లడించారు. యూఏఈ చేరుకున్న చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టులో 13 మంది కరోనా బారిన పడిన నేపథ్యంలో ఐపీఎల్ షెడ్యూల్ ప్రకారం జరుగుతుందా లేదా అనే అనుమానాలు నెలకొన్నాయి. కరోనా కారణంగానే ఐపీఎల్ (IPL) పూర్తి షెడ్యూల్‌ను బీసీసీఐ (BCCI) విడుదల చేయట్లేదనే వార్తలు కూడా వినిపించాయి. వీటన్నింటినీ ఖండిస్తూ బీసీసీఐ […]

Update: 2020-09-02 08:54 GMT

స్పోర్ట్స్ : బీసీసీఐ (BCCI) గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) జరుగుతుందని బోర్డు కోశాధికారి అరుణ్ ధుమాల్ వెల్లడించారు. యూఏఈ చేరుకున్న చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టులో 13 మంది కరోనా బారిన పడిన నేపథ్యంలో ఐపీఎల్ షెడ్యూల్ ప్రకారం జరుగుతుందా లేదా అనే అనుమానాలు నెలకొన్నాయి. కరోనా కారణంగానే ఐపీఎల్ (IPL) పూర్తి షెడ్యూల్‌ను బీసీసీఐ (BCCI) విడుదల చేయట్లేదనే వార్తలు కూడా వినిపించాయి.

వీటన్నింటినీ ఖండిస్తూ బీసీసీఐ కోశాధికారి (BCCI Treasurer) అరుణ్ ధుమాల్ ప్రకటన చేశారు. గతంలో చెప్పిన షెడ్యూల్ మేరకే యూఏఈలో ఐపీఎల్ జరుగుతుందని స్పష్టం చేశారు. ‘సీఎస్కే (CSK) జట్టులోని అందరు సభ్యులకు కరోనా నెగెటివ్ వచ్చింది. ఐపీఎల్ గత షెడ్యూల్ మేరకే జరుగుతుంది. ప్లేయర్లు, ఫ్రాంచైజీ యాజమాన్యాలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రేక్షకులు లేకుండానే ఐపీఎల్ నిర్వహించనున్నాం. కాబట్టి బయోబబుల్‌ను బ్రేక్ చేసే అవకాశాలే లేవు’ అని ధుమాల్ అన్నారు.

ప్రస్తుతం ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ ( IPL Governing Council Chairman) బ్రిజేష్ పటేల్ మరి కొందరు బీసీసీఐ పెద్దలతో కలసి ఐపీఎల్ పూర్తి స్థాయి షెడ్యూల్ రూపొందించే పనిలో ఉన్నారు. ఎమిరేట్స్ క్రికెట్ బోర్డ్ (Emirates Cricket Board) సహకారంతో ఏ మ్యాచ్ ఏ రోజు నిర్వహించాలనే కసరత్తు చేస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో షెడ్యూల్ విడుదల చేస్తారని బీసీసీఐ వర్గాలు అంటున్నాయి.

Tags:    

Similar News