ఆసీస్, ఇంగ్లాండ్ ప్లేయర్ల కోసం చార్టెడ్ ఫ్లైట్లు
దిశ, స్పోర్ట్స్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)13వ సీజన్ ప్రారంభానికి రోజులు దగ్గర పడుతుండటంతో ఫ్రాంచైజీలు (Franchisees) కూడా ఇంకా రావాల్సిన ఆటగాళ్ల కోసం ప్రయాణపు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య వన్డే, టీ20 సిరీస్ జరుగుతుండటంతో వాళ్లు ఐపీఎల్ (IPL)కు ఆలస్యంగా చేరుకోనున్నారు. ఏడు ఫ్రాంచైజీలలో పలువురు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఉండటంతో వాళ్ల కోసం చార్టెడ్ ఫ్లైట్ బుక్ చేశారని సమాచారం. అన్ని ఫ్రాంచైజీలు కలిపి 22 మంది ఆటగాళ్ల కోసం రూ. […]
దిశ, స్పోర్ట్స్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)13వ సీజన్ ప్రారంభానికి రోజులు దగ్గర పడుతుండటంతో ఫ్రాంచైజీలు (Franchisees) కూడా ఇంకా రావాల్సిన ఆటగాళ్ల కోసం ప్రయాణపు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య వన్డే, టీ20 సిరీస్ జరుగుతుండటంతో వాళ్లు ఐపీఎల్ (IPL)కు ఆలస్యంగా చేరుకోనున్నారు. ఏడు ఫ్రాంచైజీలలో పలువురు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఉండటంతో వాళ్ల కోసం చార్టెడ్ ఫ్లైట్ బుక్ చేశారని సమాచారం.
అన్ని ఫ్రాంచైజీలు కలిపి 22 మంది ఆటగాళ్ల కోసం రూ. 1 కోటితో ఇంగ్లాండ్ నుంచి దుబాయ్‌కి ఫ్లైట్ బుక్ చేసినట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో బయో బబుల్ (Bio Bubble) వాతావరణంలో ఉన్న వీళ్లందరూ శానిటైజ్ చేసిన బస్సులో విమానాశ్రయానికి చేరుకుంటారు. వీరి వాహనాన్ని ఇప్పటికే బయో సెక్యూర్ (Bio Secure)వాతావరణంలో ఉన్న డ్రైవర్ నడిపిస్తాడు. ఇమ్మిగ్రేషన్ సమయంలో కూడా వీళ్లందరూ ప్రత్యేక కేటగిరీగా పరిణించి వెంటనే ప్రాసెసింగ్ పూర్తి చేస్తారు. అక్కడి నుంచి శానిటైజ్ చేసిన ప్రత్యేక విమానంలో దుబాయ్ చేరుకుంటారు. వచ్చిన వెంటనే ఆటగాళ్లందరికీ కరోనా పరీక్షలు నిర్వహించి రెండు సార్లు నెగెటివ్ వచ్చిన తర్వాత బయోబబుల్ లోనికి అనుమతిస్తారని తెలుస్తున్నది.