‘ఆ మూడు వేదికలపై నిర్ణయం తీసుకుంటాం’

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్ 14వ సీజన్ కోసం బీసీసీఐ షార్ట్ లిస్ట్ చేసిన వేదికల్లో హైదరాబాద్, మొహలీ, జైపూర్‌లను తప్పించారు. దీంతో ఆ సన్ రైజర్స్, పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యాలు బీసీసీఐపై గుర్రుగా ఉన్నాయి. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతులు ఇస్తామని చెబుతున్నా.. ఎందుకు తప్పించారంటూ నిలదీశాయి. తాజాగా ఈ విషయంపై ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ స్పందించారు. అతి త్వరలోనే గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ […]

Update: 2021-03-04 09:17 GMT

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్ 14వ సీజన్ కోసం బీసీసీఐ షార్ట్ లిస్ట్ చేసిన వేదికల్లో హైదరాబాద్, మొహలీ, జైపూర్‌లను తప్పించారు. దీంతో ఆ సన్ రైజర్స్, పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యాలు బీసీసీఐపై గుర్రుగా ఉన్నాయి. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతులు ఇస్తామని చెబుతున్నా.. ఎందుకు తప్పించారంటూ నిలదీశాయి. తాజాగా ఈ విషయంపై ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ స్పందించారు. అతి త్వరలోనే గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఆ మూడు వేదికలపై ఫ్రాంచైజీల డిమాండును పరిశీలిస్తామన్నారు. వీడియో కాన్ఫరెన్స్ పద్దతిలో లేదా ప్రత్యక్షంగా అయినా అహ్మదాబాద్‌లో ఈ సమావేశం నిర్వహిస్తామని బ్రిజేష్ పటేల్ తెలిపారు. ఆ సమావేశంలోనే ఐపీఎల్ షెడ్యూల్‌పై తుది నిర్ణయం వెలువడుతుందని ఆయన స్పష్టం చేశారు. బ్రిజేష్ పటేల్ వ్యాఖ్యలతో హైదరాబాద్‌లో మ్యాచ్‌లు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.

Tags:    

Similar News