కోహ్లీ టీమ్ 92 ఆల్‌అవుట్.. వైరల్‌గా దీపిక కామెంట్స్!

దిశ, సినిమా : దుబాయ్ వేదికగా జరుగుతున్న ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ నేతృత్వంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీమ్.. కోల్‌కతా నైట్‌రైడర్స్ చేతిలో ఘోరంగా ఓడిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు 92 పరుగులకే ఆల్‌అవుట్ అయింది. ఇక స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా.. ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి టార్గెట్ చేధించింది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ సేన బ్యాడ్ పర్ఫార్మెన్స్‌ పక్కనబెడితే.. బాలీవుడ్ నటి దీపికా పదుకొనే ఓల్డ్ ట్వీట్ ఒకటి ఇప్పుడు […]

Update: 2021-09-21 05:56 GMT

దిశ, సినిమా : దుబాయ్ వేదికగా జరుగుతున్న ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ నేతృత్వంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీమ్.. కోల్‌కతా నైట్‌రైడర్స్ చేతిలో ఘోరంగా ఓడిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు 92 పరుగులకే ఆల్‌అవుట్ అయింది. ఇక స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా.. ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి టార్గెట్ చేధించింది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ సేన బ్యాడ్ పర్ఫార్మెన్స్‌ పక్కనబెడితే.. బాలీవుడ్ నటి దీపికా పదుకొనే ఓల్డ్ ట్వీట్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒకప్పుడు ఆర్సీబీకి వీరాభిమాని అయిన దీపిక.. ఐపీఎల్ ప్రారంభ దశలో స్టేడియంకు వచ్చి మ్యాచ్‌లు చూసేది. ఈ క్రమంలోనే 2010లో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌ 92 పరుగులకే కుప్పకూలింది. ఆ సమయంలో ట్వీట్ చేసిన దీపిక.. ‘92 అసలు స్కోరేనా? దూసుకుపో ఆర్సీబీ’ అంటూ రాజస్థాన్ టీమ్‌ను ట్రోల్ చేసింది. అప్పుడు ఆర్సీబీకి అనిల్ కుంబ్లే కెప్టెన్ కాగా.. వికెట్ నష్టపోకుండా టార్గెట్ ఫినిష్ చేసింది. అయితే అదే ట్వీట్‌‌ను ఇప్పుడు నెటిజన్స్ రీ‌ట్వీట్ చేస్తున్నారు.

ఇక సోమవారం నాటి మ్యాచ్ విషయానికొస్తే.. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో విఫలమై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. పైగా కోహ్లీకి ఐపీఎల్‌లో 200 మ్యాచ్ కావడం విశేషం. వరుణ్ చక్రవర్తి, ఆండ్రూ రసెల్ చెరో మూడు వికెట్లతో ఆర్సీబీ బ్యాటింగ్‌ను కుప్పకూల్చారు.

ఆ ఆంటీల మోజులో స్టార్ డైరెక్టర్.. ఓ పక్క అవకాశం.. మరో ఒక్క అఫైర్

Tags:    

Similar News