'బీసీసీఐ నా పాటను కాపీ కొట్టింది'

దిశ, స్పోర్ట్స్ : యూఏఈలో జరుగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (Indian Premier League)కోసం బీసీసీఐ ఒక థీమ్ సాంగ్ రూపొందించిన విషయం తెలిసిందే. గత ఆదివారం ఐపీఎల్ (IPL) షెడ్యూల్ విడుదల చేసిన తర్వాత ఈ థీమ్ సాంగ్ కూడా విడుదల చేసింది. అయితే బీసీసీఐ (BCCI) తన పాటను కాపీ కొట్టిందని ప్రముఖ ర్యాపర్ కృష్ణ కౌల్ ఆరోపిస్తున్నాడు. తన పాట ‘దేఖ్ కౌన్ వాపస్ ఆయా’ అనే పాటనే బీసీసీఐ ‘ఆయేంగే హమ్ […]

Update: 2020-09-08 10:19 GMT

దిశ, స్పోర్ట్స్ : యూఏఈలో జరుగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (Indian Premier League)కోసం బీసీసీఐ ఒక థీమ్ సాంగ్ రూపొందించిన విషయం తెలిసిందే. గత ఆదివారం ఐపీఎల్ (IPL) షెడ్యూల్ విడుదల చేసిన తర్వాత ఈ థీమ్ సాంగ్ కూడా విడుదల చేసింది. అయితే బీసీసీఐ (BCCI) తన పాటను కాపీ కొట్టిందని ప్రముఖ ర్యాపర్ కృష్ణ కౌల్ ఆరోపిస్తున్నాడు. తన పాట ‘దేఖ్ కౌన్ వాపస్ ఆయా’ అనే పాటనే బీసీసీఐ ‘ఆయేంగే హమ్ వాపస్’ గా మార్చి వాడుకుందని అతడు ఆరోపిస్తున్నాడు.

తన పాటను వాడి కనీసం తనకు క్రెడిట్ ఇవ్వలేదని, దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని అతడు ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు. ఇప్పటికే ఈ విషయాన్ని తన సహచర ఆర్టిస్టులకు తెలియజేశానని చెప్పాడు. కాగా ఈ విషయమై ఐపీఎల్ థీమ్ సాంగ్ పాడిన ర్యాపర్ స్పందించాడు. ‘తాను కేవలం పాటను మాత్రమే పాడానని.. కంపోజింగ్ తాను చేయలేదని’ ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నాడు. ఆ పాటలోని వాయిస్ మాత్రమే తనదని అతడు స్పష్టం చేశాడు. మరి ఈ వివాదాన్ని బీసీసీఐ ఎలా పరిష్కరిస్తుందో చూడాల్సిందే.

Tags:    

Similar News