చైనా కంపెనీతో ఒప్పందం రద్దుకు సిద్ధం:ఐవోఏ
దిశ, స్పోర్ట్స్: ఇండో-చైనా సరిహద్దు ఘర్షణల్లో 20మంది భారత సైనికులు వీరమరణం పొందినప్పట్నుంచీ చైనా ఉత్పత్తుల బహిష్కరణపై డిమాండ్లు పెరుగుతున్నాయి. చైనా చేస్తున్న దాష్టీకాలకు బుద్ధి చెప్పాలని భారతీయులందరూ ముక్తకఠంతో కోరుతున్నారు. ఈ నేపథ్యంలో చైనీస్ స్పోర్ట్స్ కంపెనీతో ఉన్న ఒప్పందాన్ని రద్దు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ‘ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్’(ఐవోఏ) ప్రధాన కార్యదర్శి రాజీవ్ మెహతా అన్నారు. ‘టోక్యో ఒలింపిక్స్ ముగిసేంత వరకు మాకు కిట్ స్పాన్సర్‌గా లీనింగ్‌తో ఒప్పందం ఉంది. అయితే, మాకు దేశమే […]
దిశ, స్పోర్ట్స్: ఇండో-చైనా సరిహద్దు ఘర్షణల్లో 20మంది భారత సైనికులు వీరమరణం పొందినప్పట్నుంచీ చైనా ఉత్పత్తుల బహిష్కరణపై డిమాండ్లు పెరుగుతున్నాయి. చైనా చేస్తున్న దాష్టీకాలకు బుద్ధి చెప్పాలని భారతీయులందరూ ముక్తకఠంతో కోరుతున్నారు. ఈ నేపథ్యంలో చైనీస్ స్పోర్ట్స్ కంపెనీతో ఉన్న ఒప్పందాన్ని రద్దు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ‘ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్’(ఐవోఏ) ప్రధాన కార్యదర్శి రాజీవ్ మెహతా అన్నారు. ‘టోక్యో ఒలింపిక్స్ ముగిసేంత వరకు మాకు కిట్ స్పాన్సర్‌గా లీనింగ్‌తో ఒప్పందం ఉంది. అయితే, మాకు దేశమే ముఖ్యం. ఒకవేళ లీనింగ్ కంపెనీతో ఒప్పందం రద్దు చేసుకోవాలని సభ్యులు భావిస్తే సాధారణ సమావేశంలో చర్చించి తప్పకుండా నిర్ణయం తీసుకుంటాం’ అని మెహతా అన్నారు. మరోవైపు బీసీసీఐ కూడా ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌గా ఉన్న వీవోతో ఒప్పందం రద్దు చేసుకోవాలని డిమాండ్లు పెరిగాయి. అయితే, ప్రజల భావోద్వేగాలతో చైనా కంపెనీల ఒప్పందాలపై నిర్ణయం తీసుకోలేమని బీసీసీఐ కోశాధికారి అరుణు ధుమాల్ అన్నారు. వీవో ఒప్పందం వల్ల భారత్‌కే మేలు కానీ చైనాకు కాదని చెప్పారు.