సర్వారం సొసైటీ ఇష్యూ: తప్పొకరిది.. వేటు మరొకరిపై

దిశ ప్రతినిధి, నల్లగొండ: సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం సర్వారం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం(పీఏసీఎస్)లో జరిగిన భారీ అక్రమాలను ‘దిశ’ ప్రత్యేక కథనంతో వెలుగులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై పూర్తిస్థాయి విచారణ జరిపిన అధికారులు నామమాత్రపు చర్యలతోనే సరిపెట్టారు. అసలు అక్రమాలు చేసింది ఒకరైతే.. వేటు మరొకరిపై వేసి చేతులు దులుపుకున్నారు. వాస్తవానికి సర్వారం పీఏసీఎస్ పరిధిలో దాదాపు 77వేల బస్తాలకు పైగా ధాన్యం అక్రమమార్గంలో అమ్మి రూ.2కోట్లకు పైగానే గోల్‌మాల్ చేశారు. […]

Update: 2021-06-04 07:43 GMT

దిశ ప్రతినిధి, నల్లగొండ: సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం సర్వారం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం(పీఏసీఎస్)లో జరిగిన భారీ అక్రమాలను ‘దిశ’ ప్రత్యేక కథనంతో వెలుగులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై పూర్తిస్థాయి విచారణ జరిపిన అధికారులు నామమాత్రపు చర్యలతోనే సరిపెట్టారు. అసలు అక్రమాలు చేసింది ఒకరైతే.. వేటు మరొకరిపై వేసి చేతులు దులుపుకున్నారు. వాస్తవానికి సర్వారం పీఏసీఎస్ పరిధిలో దాదాపు 77వేల బస్తాలకు పైగా ధాన్యం అక్రమమార్గంలో అమ్మి రూ.2కోట్లకు పైగానే గోల్‌మాల్ చేశారు. ఇందులో ఓ ప్రజాప్రతినిధితో పాటు పీఏసీఎస్‌లో పనిచేసే ఓ కిందిస్థాయి ఉద్యోగి ప్రమేయం ఉంది. అయితే ఈ వ్యవహారంలో విచారణ చేపట్టిన జిల్లా సహాకార అధికారులు బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేశారు. అయితే అసలు దొంగలను కాకుండా పక్కవారిపై వేటు వేయడం ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

సర్వారం సొసైటీ సీఈఓ సస్పెండ్

సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలంలోని సర్వారం సహకార సంఘంలో ధాన్యం 1010 రకం దాన్యం కొనుగోలు భారీ స్కాం జరిగిందని ఏప్రిల్ 29న ‘దిశ’ పేపర్‌లో ‘సర్వారం ఫలహరం’ కథనం వెలువడింది. దీనిపై స్పందించిన సూర్యాపేట జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి పూర్తిస్థాయి విచారణ జరిపి నివేదికను సమర్పించాలని హుజూర్‌నగర్ ఆర్డీఓ వెంకారెడ్డిని ఆదేశించారు. ఈ విచారణలో సహకార సంఘం సీఈవో పరశురాం ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ధాన్యం కొనుగోలు చేశారని విచారణలో తేల్చారు. ఆర్డీవో ఈ నివేదికను కలెక్టర్, అడిషనల్ కలెక్టర్‌కు నివేదిక పంపించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా కో-ఆపరేటివ్ ఆఫీసర్, సీఈఓను సస్పెండ్ చేస్తూ ఈ నెల 3న (గురువారం) ఉత్తర్వులు జారీ చేశారు.

రాజకీయ నేతల ప్రమేయంతోనే..

వాస్తవానికి సర్వారం పీఏసీఎస్ పరిధిలో అక్రమాలకు పాల్పడింది ఓ ప్రజాప్రతినిధి అనేది బహిరంగ రహస్యం. వారికి అధికారులు సహకరించారనేది వాస్తవం. అక్రమాలకు తేర లేపిన సదరు ప్రజాప్రతినిధి, రైసు మిల్లుల నిర్వాహకులను వదిలేసి.. పీఏసీఎస్ సీఈఓ ఒక్కరిపైనే చర్యలు తీసుకున్నారు. దీనివెనుక రాజకీయ ప్రమేయం ఉండడంతోనే సీఈఓను బలి చేశారంటూ స్థానికంగా పుకార్లు షికార్లు చేస్తున్నారు. అక్రమాలపై స్పందించినందుకు అధికార యంత్రాంగానికి హ్యాట్సాఫ్ చెబుతూనే.. మరోవైపు మిగిలిన దొంగలపై చర్యలు తీసుకోకపోవడంపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా సర్వారం పీఏసీఎస్ అక్రమాలపై పూర్తిస్థాయి నివేదిక చేపట్టి.. అసలు సూత్రధారులపై చర్యలు తీసుకోవాలంటూ పలువురు కోరుతున్నారు.

Tags:    

Similar News