భారత్ మరో వ్యూహాత్మక ముందడుగు.. ఈ సారి రిపబ్లిక్ వేడుకలకు అతిథులెవరంటే..?
దిశ, వెబ్ డెస్క్: మనం జరుపుకునే రిపబ్లిక్ డే సంబరాలకు ప్రతి సారీ ఏదో ఒక దేశ అధ్యక్షుడిని పిలవడం ఆనవాయితీ. అయితే 2018 లో మాత్రమే 10 ఏషియన్ దేశాల ప్రతినిధులను ఆహ్వానించారు. కానీ రెండు కన్నా ఏక్కవ దేశలను ఎప్పుడూ ఆహ్వానించలేదు. ఈ సారి మాత్రం భిన్నంగా 5 దేశాలకు ఆహ్వానాలు పంపారు. రిపబ్లిక్ వేడుకలు ఇంకా నెల రోజులు ఉండగా షెడ్యూల్ ఖరారు కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఆఫ్ఘన్ లో ఉగ్ర […]
దిశ, వెబ్ డెస్క్: మనం జరుపుకునే రిపబ్లిక్ డే సంబరాలకు ప్రతి సారీ ఏదో ఒక దేశ అధ్యక్షుడిని పిలవడం ఆనవాయితీ. అయితే 2018 లో మాత్రమే 10 ఏషియన్ దేశాల ప్రతినిధులను ఆహ్వానించారు. కానీ రెండు కన్నా ఏక్కవ దేశలను ఎప్పుడూ ఆహ్వానించలేదు. ఈ సారి మాత్రం భిన్నంగా 5 దేశాలకు ఆహ్వానాలు పంపారు. రిపబ్లిక్ వేడుకలు ఇంకా నెల రోజులు ఉండగా షెడ్యూల్ ఖరారు కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఆఫ్ఘన్ లో ఉగ్ర ప్రభుత్వం ఏర్పడటంతో మన దేశం మరింత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. .
అందుకే అటు చైనా ఇటు ఆఫ్ఘన్ ఇంకో వైపు పాకిస్తాన్ కు సరిహద్దులు గా గల దేశాలను ఈ సారి ముఖ్య అథిదులు గా ఆహ్వానించారు. సోవియేట్ యూనియన్ నుంచి విడిపోయిన తుర్కిమెనిస్తాన్, కజకిస్తాన్, తజకిస్తాన్, కిర్గిస్తాన్, ఉజ్బెకిస్తాన్ లకు ఆహ్వానాలు పంపింది. చుట్టూ ఉన్న మూడు శత్రు దేశాలకు చెక్ పెట్టాలంటే ఈ దేశాల సాన్నిహిత్యం ఎంతో అవసరం. దాన్నే మన దేశం గుర్తించింది. మన దేశానికి ఆహ్వానించడం ద్వారా అన్ని దేశాలతో మైత్రి సంబంధాలు పెంచుకునే అవకాశం ఏర్పడింది.
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకూ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, ప్రెంచ్ అధ్యక్షుడు ప్రాంకోయిస్, అరబ్ దేశాల నుంచి మహమ్మద్ బీన్ జాయేద్, తర్వాత 10 ఏషియన్ దేశాలను, 2019 లో దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమాఫోసాను, తర్వాత బ్రెజిల్ నుంచి జైర్ బోల్సనారోలు ముఖ్య అథిదులు గా విచ్చేశారు. అయితే కరోనా కరణంగా 2021 లో రావాల్సిన బ్రిటన్ ప్రధాని బోరీస్ జాన్సన్ రాలేక పోయాడు. ఇప్పుడు ఏకంగా 5 దేశాలకు ఆహ్వానం పంపింది కేంద్ర ప్రభుత్వం.