అయోధ్య దీపోత్సవానికి కిషన్‌రెడ్డికి ఆహ్వానం
దిశ, తెలంగాణ బ్యూరో: దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని అయోధ్యలో చేపట్టే దీపోత్సవానికి తరలిరావాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ నుంచి ఆహ్వానం అందినట్లు బీజేపీ నాయకులు ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. నవంబర్ 3వ తేదీన ఈ కార్యక్రమం జరగనున్నట్లు వారు చెప్పారు. దీపావళి నాడు సరయూ నది ఒడ్డున ఉన్న రామ్ కీ పైడి ఘాట్ వద్ద సుమారు 9 లక్షల దీపాలు, నగరంలోని ఇతర ప్రదేశాల్లో 3 లక్షల దీపాలు […]
దిశ, తెలంగాణ బ్యూరో: దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని అయోధ్యలో చేపట్టే దీపోత్సవానికి తరలిరావాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ నుంచి ఆహ్వానం అందినట్లు బీజేపీ నాయకులు ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. నవంబర్ 3వ తేదీన ఈ కార్యక్రమం జరగనున్నట్లు వారు చెప్పారు. దీపావళి నాడు సరయూ నది ఒడ్డున ఉన్న రామ్ కీ పైడి ఘాట్ వద్ద సుమారు 9 లక్షల దీపాలు, నగరంలోని ఇతర ప్రదేశాల్లో 3 లక్షల దీపాలు మొత్తంగా అయోధ్య నగరమంతటా 12 లక్షల మట్టి దీపాలు వెలిగించి రికార్డు సృష్టించనున్నట్లు వారు పేర్కొన్నారు.
జానపద కళాకారుల ర్యాలీ, రామాయణంలోని పలు ఇతిహాస గాథలు, సరయూ నది వద్ద చేపట్టే హారతి, త్రీడీ హోలోగ్రాఫిక్ షో, ప్రొజెక్షన్ మ్యాపింగ్, లేజర్ షో, రామ్ లీలా ప్రదర్శనలతో అయోధ్య దీపోత్సవం అలరించనుందని బీజేపీ నాయకులు వెల్లడించారు.