దివ్యాంగ విద్యార్థుల ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం
దిశ,మెదక్: దివ్యాంగ విద్యార్థులు పోస్ట్ మెట్రిక్, ప్రీ-మెట్రిక్ ఉపకార వేతనాల కోసం ఈ నెల 30న దరఖాస్తు చేసుకోవాల్సిందిగా జిల్లా విద్యాశాఖాధికారి రమేష్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జాతీయ స్కాలర్ షిప్ పోర్టల్ https://scholarships.gov.in ద్వారా దరఖాస్తులను ఆన్ లైన్‌లో దాఖలు చేయవచ్చని అన్నారు. విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలంటే ముందుగా వారు చదివే విద్యాసంస్థ జాతీయ స్కాలర్ షిప్ పోర్టల్‌లో నమోదయి ఉండాలని పేర్కొన్నారు. పోర్టల్‌లో ఇప్పటి వరకు నమోదు కానీ విద్యాసంస్థలు వెంటనే […]
దిశ,మెదక్: దివ్యాంగ విద్యార్థులు పోస్ట్ మెట్రిక్, ప్రీ-మెట్రిక్ ఉపకార వేతనాల కోసం ఈ నెల 30న దరఖాస్తు చేసుకోవాల్సిందిగా జిల్లా విద్యాశాఖాధికారి రమేష్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జాతీయ స్కాలర్ షిప్ పోర్టల్ https://scholarships.gov.in ద్వారా దరఖాస్తులను ఆన్ లైన్‌లో దాఖలు చేయవచ్చని అన్నారు.
విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలంటే ముందుగా వారు చదివే విద్యాసంస్థ జాతీయ స్కాలర్ షిప్ పోర్టల్‌లో నమోదయి ఉండాలని పేర్కొన్నారు. పోర్టల్‌లో ఇప్పటి వరకు నమోదు కానీ విద్యాసంస్థలు వెంటనే నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. సదరం సర్టిఫికెట్ ఉన్న జిల్లాలోని దివ్యాంగ విద్యార్థులు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవలసిందిగా ఆయన సూచించారు.