షేర్ మార్కెటా.. మజాకా.. లక్ష పెడితే.. 9 నెలల్లో 58 లక్షలు!

దిశ, డైనమిక్ బ్యూరో: స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడం అంటే అంతా సులువు కాదు. షేర్స్ ఈ రోజు పెరిగాయని సంతోషించేలోపు అమాంతం నష్టాల్లోకి జారిపోతుంటాయ్. అందుకే చాలా మంది షేర్స్ లో ఇన్వెస్ట్ చేసేందుకు వెనకడుగేస్తుంటారు. అయితే, దీని గురించి పూర్తి అవగాహన ఉంటే లక్షల్లో లాభాలు ఆర్జించడం అంత కష్టమేమీ కాదు. కానీ, ఎప్పుడూ లేనివిధంగా 2021లో ఇన్వెస్టర్లకు భారీగా లాభాలు వచ్చాయని నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఈకేఐ ఎనర్జీ […]

Update: 2021-12-27 09:06 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడం అంటే అంతా సులువు కాదు. షేర్స్ ఈ రోజు పెరిగాయని సంతోషించేలోపు అమాంతం నష్టాల్లోకి జారిపోతుంటాయ్. అందుకే చాలా మంది షేర్స్ లో ఇన్వెస్ట్ చేసేందుకు వెనకడుగేస్తుంటారు. అయితే, దీని గురించి పూర్తి అవగాహన ఉంటే లక్షల్లో లాభాలు ఆర్జించడం అంత కష్టమేమీ కాదు. కానీ, ఎప్పుడూ లేనివిధంగా 2021లో ఇన్వెస్టర్లకు భారీగా లాభాలు వచ్చాయని నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఈకేఐ ఎనర్జీ సర్వీసెస్ స్టాక్ వాల్యు రూ.102 వద్ద ఓపెన్ అవ్వగా.. కేవలం తొమ్మిది నెలల్లోనే దీని వాల్యూ 58 రెట్లు పెరిగింది. ఈ స్టాక్ పై లక్ష రూపాయల ఇన్వెస్ట్ చేసినవారికి తొమ్మిది నెలల్లోనే రూ.58.34 లక్షలకు పెరిగింది. ఇలా ఈ ఏడాది ఇలాంటి కంపెనీలు ఇన్వెస్టర్ల పాలిట వరాలుగా మారాయి.

Tags:    

Similar News