చెల్లని ఓట్లు వేశారు.. అసలు చదువుకున్నోళ్లేనా..?

దిశ, తెలంగాణ బ్యూరో: అసలు వీళ్లంతా పట్టభద్రులేనా..? చదువుకునేవాళ్లేనా..? అని మండలి ఎన్నికల్లో చెల్లుబాటు కాని ఓట్లు వేసిన కొందరు గ్రాడ్యుయేట్ల తీరును చూసి సామాన్య జనం ముక్కునవేలేసుకుంటున్నారు. కనీసం డిగ్రీకి తగ్గకుండా విద్యార్హత ఉన్నవాళ్లు రెండు స్థానాల్లో వేసినఓట్లు ఐదు శాతానికి తగ్గకుండా చెల్లుబాటు కాలేదు. 2015 తర్వాత ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో ఓ వైపు ఓటింగ్ శాతం పెరిగిందనే ఆనందంలో ఎన్నికల అధికారులు ఉండగా, గ్రాడ్యుయేట్స్ కూడా తమ ఓట్లను సక్రమంగా వేయలేకపోవడం […]

Update: 2021-03-21 12:44 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: అసలు వీళ్లంతా పట్టభద్రులేనా..? చదువుకునేవాళ్లేనా..? అని మండలి ఎన్నికల్లో చెల్లుబాటు కాని ఓట్లు వేసిన కొందరు గ్రాడ్యుయేట్ల తీరును చూసి సామాన్య జనం ముక్కునవేలేసుకుంటున్నారు. కనీసం డిగ్రీకి తగ్గకుండా విద్యార్హత ఉన్నవాళ్లు రెండు స్థానాల్లో వేసినఓట్లు ఐదు శాతానికి తగ్గకుండా చెల్లుబాటు కాలేదు. 2015 తర్వాత ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో ఓ వైపు ఓటింగ్ శాతం పెరిగిందనే ఆనందంలో ఎన్నికల అధికారులు ఉండగా, గ్రాడ్యుయేట్స్ కూడా తమ ఓట్లను సక్రమంగా వేయలేకపోవడం విమర్శలకు తావిస్తోంది. గత ఎన్నికలతో పోలిస్తే హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానంలో ఓటింగ్‌ దాదాపు రెట్టింపైంది. ప్రతి రౌండ్‌లోనూ మెజారిటీ చాలా తక్కువ సంఖ్యలో ఉండగా.. అదే స్థాయిలో చెల్లని ఓట్లు కూడా ఉన్నాయి. అందరూ చదువుకున్నవారే, ఎన్నికలపై అవగాహన కలిగినవారే.. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు చిత్తవడంతో పట్టభద్రుల విద్యానైపుణ్యాలపై సందేహాలు లేవనెత్తుతున్నారు.

అనవసర రాతలు, గీతలు

హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్​నగర్ స్థానంలో 3,58,348 ఓట్లు పోలవ్వగా 21,309 ఓట్లు చెల్లుబాటు కాలేదు. చెల్లని ఓట్లు ఓ అభ్యర్థికి వచ్చాయనుకుంటే ఐదో స్థానంలో నిలుస్తున్నాయి. నల్లగొండ, వరంగల్, ఖమ్మం ఎమ్మెల్సీ స్థానంలో దాదాపు ఇదే పరిస్థితి ఉంది. పోలైన 3,87,969 ఓట్లలో 21,636 ఓట్లు చెల్లుబాటు కాలేదు. అత్యధిక మొదటి ప్రాధాన్యత ఓట్లు సాధించిన తొలి నలుగురు అభ్యర్థుల మధ్య కీలకమైన పోరు నెలకొన్న సందర్భంలో చెల్లని ఓట్లను వేసిన పట్టభద్రులు వారి రాజకీయ బలాలను కొంత అయోమయానికి గురిచేశారన్నది స్పష్టమవుతోంది. నిబంధనల ప్రకారం కాకుండా తమ నాయకుల పేర్లు రాయడం, అభ్యర్థికి ఎదురుగా అదే సంఖ్య వేయడం, అనవసర రాతలు, గీతలతో ఓట్లు తిరస్కరణకు గురయ్యాయి. పట్టభద్రులే ఈ రకంగా ఓట్లను చెల్లని విధంగా వేయడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ స్థానం

2021 ఎన్నికల సరళి:
పోటీలోని అభ్యర్థులు: 93 మంది
మొత్తం ఓట్లు: 5,31,268
పోలైన ఓట్లు: 3,58,348
పోలైన ఓట్ల శాతం: 67.45
చెల్లుబాటు కానివి: 21,309 :
చెల్లుబాటు కాని ఓట్ల శాతం: 5.94
చెల్లుబాటు అయినవి: 3,37,039
విజేతకు రావాల్సిన ఓట్ల సంఖ్య: 1,68,520

2015లో ఓట్ల సరళి :
పోటీలోని అభ్యర్థులు: 31
మొత్తం ఓట్లు: 2,96,318
పోలైన ఓట్లు: 1,13,380
పోలైన ఓట్ల శాతం: 38
చెల్లుబాటు కానివి: 8,433
చెల్లుబాటు కాని ఓట్ల శాతం: 7.43
చెల్లుబాటు అయినవి: 1,04,947
విజేతకు రావాల్సిన ఓట్ల సంఖ్య: 52,475

నల్లగొండ – ఖమ్మం – వరంగల్

2021 ఎన్నికల సరళి
పోటీలోని అభ్యర్థులు: 71
మొత్తం ఓట్లు: 5,05,565
పోలైన ఓట్లు: 3,87,969
పోలైన ఓట్ల శాతం: 76.73
చెల్లుబాటు కానివి: 21,636
చెల్లుబాటు కాని ఓట్ల శాతం: 5.57
చెల్లుబాటు అయినవి: 3,66,333
విజేతకు రావాల్సిన ఓట్ల సంఖ్య: 1,83,168

2015లో ఓట్ల సరళి
పోటీలోని అభ్యర్థులు: 18
మొత్తం ఓట్లు: 2,81,138
పోలైన ఓట్లు: 1,53,548
పోలైన ఓట్ల శాతం: 54.61
చెల్లుబాటు కానివి:14,279
చెల్లుబాటు కాని ఓట్ల శాతం: 9.3
చెల్లుబాటు అయినవి: 1,39,269
విజేతకు రావాల్సిన ఓట్ల సంఖ్య: 66,777

Tags:    

Similar News