ఎంటర్ ది నేవీ వెస్సెల్స్ : పుతిన్

దిశ వెబ్‌డెస్క్: రష్యా కీలక ప్రకటన చేసింది. దేశంలో కొత్తగా అరజన్ నేవీ వెస్సెల్స్ ప్రవేశ పెడుతున్నట్లు అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. పాత నేవీ షిప్‌లలో కొత్త హర్డ్‌వేర్ టెక్నాలజీని సైతం ప్రవేశపెడుతున్నామని వెల్లడించారు. మాస్కోలో నిర్వహించిన ఆర్మీ ఎక్స్‌ఫో 2021 లో అధ్యక్షుడు మాట్లాడారు. ‘మా నేవీని బలోపేతం చేయడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాం, దేశ వ్యాప్తంగా ఉన్న షిప్ యార్డులలో నాలుగు కొత్త తరం సబ్ మెరైన్‌లు, రెండు ఆధునిక నేవీ షిప్ […]

Update: 2021-08-24 05:39 GMT

దిశ వెబ్‌డెస్క్: రష్యా కీలక ప్రకటన చేసింది. దేశంలో కొత్తగా అరజన్ నేవీ వెస్సెల్స్ ప్రవేశ పెడుతున్నట్లు అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. పాత నేవీ షిప్‌లలో కొత్త హర్డ్‌వేర్ టెక్నాలజీని సైతం ప్రవేశపెడుతున్నామని వెల్లడించారు. మాస్కోలో నిర్వహించిన ఆర్మీ ఎక్స్‌ఫో 2021 లో అధ్యక్షుడు మాట్లాడారు. ‘మా నేవీని బలోపేతం చేయడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాం, దేశ వ్యాప్తంగా ఉన్న షిప్ యార్డులలో నాలుగు కొత్త తరం సబ్ మెరైన్‌లు, రెండు ఆధునిక నేవీ షిప్ తయారీ’ పూర్తవుతున్నాయని తెలిపారు. వీటిలో రెండు అణు క్షిపణులను తమతో పాటు తీసుకుని వెళ్లే సామర్థ్యం ఉన్నవని తెలుస్తోంది. వీటిని బాల్టిక్ సముద్రం, ఆర్కిటిక్ సముద్రం, జపాన్ తీర ప్రాంతాల్లో ప్రవేశపెట్టె ఆలోచన చేస్తున్నట్లు తమ ప్రణాళికను వివరించే ప్రయత్నం చేశారు.

ఇప్పటికే అర్కన్‌గ్లెస్క్ తీరంలో న్యూక్లియర్ సామర్థ్యం గల క్రూయిజ్ షిప్‌లున్నాయని, త్వరలో కజాన్ అనే పేరుగల మరో సబ్ మెరైన్ నేవీకి అందించడానికి ముమ్మరంగా తయారీదారులు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. దేశంలోని అన్ని ఆయుధాలను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తిరిగి మారుస్తున్నామని స్ఫష్టం చేశారు. రష్యా ఆయుధ పరిశ్రమను అభివృద్ధి పరచడానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నామని వివరించారు. కాగా, సైన్యంలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, రోబోట్స్‌ను ప్రవేశ పెట్టాలని మాస్కో ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. వాటితో పాటు ఇప్పటికే టెర్మినేటర్ తరహ ఆయుధాలను ప్రవేశపెట్టాలని క్రిమ్లిన్ ఆదేశించింది. ఈ తరహ ఆయుధాలతో పాటు సిరియాలో టీ-14 లాంటి రోబోటిక్ ఆయుధాలను ఐసిస్ తీవ్రవాదులపై ప్రయోగాత్మకంగా పరీశీలించిందని అమెరికా సహ యూరోపియన్ దేశాలు అనుమానిస్తున్నాయి. ఈ ఏడాది మార్చిలో కూడా లేజర్ సంబంధ ఆయుధాలను కూడా అభివృద్ధి పరచడానికి తాము సిద్ధం అంటూ ప్రకటించింది.

Tags:    

Similar News