పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఆ డబ్బులు అకౌంట్లలో జమ
దిశ, డైనమిక్ బ్యూరో : పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్ అందింది. గత కొన్ని రోజులుగా ఎదురుచూస్తున్న 2020-21కి సంబంధించిన వడ్డీ డబ్బులు ఎట్టకేలకు ఖాతాల్లో జమ కానున్నాయి. మొత్తం 25 కోట్ల మంది ఖాతాల్లో 8.5 శాతం చొప్పున వడ్డీ జమ చేయనున్నారు. అయితే, మీ అకౌంట్లో ఎంత డబ్బు జమ అయ్యిందో తెలుసుకోవాలున్నకుంటే ఇలా చేయండి. ఈపీఎఫ్‌వో సభ్యత్వ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకున్న సభ్యులు www.epfindia.gov.in లో చెక్ చేసుకోవచ్చు. ముందుగా.. వెబ్‌సైట్ ఓపెన్ […]
దిశ, డైనమిక్ బ్యూరో : పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్ అందింది. గత కొన్ని రోజులుగా ఎదురుచూస్తున్న 2020-21కి సంబంధించిన వడ్డీ డబ్బులు ఎట్టకేలకు ఖాతాల్లో జమ కానున్నాయి. మొత్తం 25 కోట్ల మంది ఖాతాల్లో 8.5 శాతం చొప్పున వడ్డీ జమ చేయనున్నారు. అయితే, మీ అకౌంట్లో ఎంత డబ్బు జమ అయ్యిందో తెలుసుకోవాలున్నకుంటే ఇలా చేయండి. ఈపీఎఫ్‌వో సభ్యత్వ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకున్న సభ్యులు www.epfindia.gov.in లో చెక్ చేసుకోవచ్చు.
ముందుగా.. వెబ్‌సైట్ ఓపెన్ చేసి our Services లోకి వెళ్లి అందులో UAN Number, Password ఎంటర్ చేయాలి. అప్పుడు కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ పూర్తి వివరాలు ఎంటర్ చేస్తే ఖాతా వివరాలు తెలుసుకోవచ్చు. అంతేకాకుండా, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి 011-22901406 కు మిస్డ్‌కాల్ ఇస్తే ఖాతాలో ఉన్న బ్యాలెన్స్ గురించి మెసేజ్ వస్తుంది. ఇలా మీ పీఎఫ్ సేవలను పొందవచ్చు.