నా చావుకు మీరే కారణం.. కేటీఆర్‌కు ట్వీట్ చేసిన ఇంటర్ స్టూడెంట్

దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణ ఇంటర్మీడియెట్ ఫస్టియర్ ఫలితాలను ఇంటర్ బోర్డు గురువారం ప్రకటించింది. ఈసారి ఏకంగా సగానికిపైగా విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. ఈ క్రమంలో విద్యార్థుల మానసికంగా కృంగిపోయి ఆత్మహత్యలకు పాల్పడే అవకాశం ఉన్నందున విద్యాశాఖ అప్రమత్తమైంది. విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చేందుకు సైకాలజిస్టులను నియమించింది. అనుకున్న విధంగానే ఓ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటానని ట్విట్టర్ వేదికగా మంత్రులు కేటీఆర్, సబితలను ట్యాగ్ చేస్తూ హెచ్చరించాడు. తాను నాలుగు సబ్జెక్టులు ఫెయిల్ అయ్యానని, ఏది […]

Update: 2021-12-16 08:31 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణ ఇంటర్మీడియెట్ ఫస్టియర్ ఫలితాలను ఇంటర్ బోర్డు గురువారం ప్రకటించింది. ఈసారి ఏకంగా సగానికిపైగా విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. ఈ క్రమంలో విద్యార్థుల మానసికంగా కృంగిపోయి ఆత్మహత్యలకు పాల్పడే అవకాశం ఉన్నందున విద్యాశాఖ అప్రమత్తమైంది. విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చేందుకు సైకాలజిస్టులను నియమించింది. అనుకున్న విధంగానే ఓ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటానని ట్విట్టర్ వేదికగా మంత్రులు కేటీఆర్, సబితలను ట్యాగ్ చేస్తూ హెచ్చరించాడు. తాను నాలుగు సబ్జెక్టులు ఫెయిల్ అయ్యానని, ఏది రాసిన పాస్ చేస్తా అని చెప్పి అందరినీ ఫెయిల్ చేశారు అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతంఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. తీరా పోస్ట్ వైరల్ అవడంతో.. తాను ఇప్పుడు బాగున్నాని, తనకు మోటివేట్ చేసినందుకు కృతజ్ఞతలు అంటూ మరో ట్వీట్ చేశాడు.

 

Tags:    

Similar News