దారుణం.. ఇంటర్ లో మార్కులు తక్కువ వచ్చాయని..
దిశ, నల్లగొండ: ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్ష ఫలితాల్లో మార్కులు తక్కువ వచ్చాయనే నెపంతో ఓ విద్యార్థిని రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాదఘటన నల్లగొండ జిల్లాకేంద్రంలో శుక్రవారం జరిగింది. నల్లగొండ రైల్వే ఎస్ హెచ్ఓ కోటేశ్వర్ రావు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లాకేంద్రానికి చెందిన వాలుగొండ హరీశ్ కుమార్-ఆదిలక్ష్మి కుమార్తె జాహ్నవి స్థానికంగా ప్రైవేట్ కళశాలలో ఇంటర్ చదువుతోంది. కరోనా కారణంగా ప్రభుత్వం ముందుగా ప్రమోట్ చేసినా, తర్వాత పరీక్షలు నిర్వహించింది. ఆ […]
దిశ, నల్లగొండ: ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్ష ఫలితాల్లో మార్కులు తక్కువ వచ్చాయనే నెపంతో ఓ విద్యార్థిని రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాదఘటన నల్లగొండ జిల్లాకేంద్రంలో శుక్రవారం జరిగింది. నల్లగొండ రైల్వే ఎస్ హెచ్ఓ కోటేశ్వర్ రావు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లాకేంద్రానికి చెందిన వాలుగొండ హరీశ్ కుమార్-ఆదిలక్ష్మి కుమార్తె జాహ్నవి స్థానికంగా ప్రైవేట్ కళశాలలో ఇంటర్ చదువుతోంది.
కరోనా కారణంగా ప్రభుత్వం ముందుగా ప్రమోట్ చేసినా, తర్వాత పరీక్షలు నిర్వహించింది. ఆ ఫలితాలు ఈ నెల16న వెలువడ్డాయి. అప్పటివరకూ చదువులో ముందుండే జాహ్నవికి గురువారం వెలువడిన ఫలితాల్లో మార్కులు తక్కువ వచ్చాయి. దీంతో విద్యా్ర్థిని తీవ్రమనోవేదనకు గురవుతూనే అర్థరాత్రి వరకూ చుదువుకుంది. అనంతరం తెల్లవారు జామున ఇంట్లో అందరూ నిద్రిస్తు్న్న సమయంలో రేల్వే స్టేషన్ సమీపం వరకూ నడుచుకుంటూ వచ్చింది.
అదే సమయంలో రైలు వస్తుండటంతో జాహ్నవి (16) రైలుకిందపడి చనిపోయింది. ఈ విషయం తెల్లవారుజామును ఉదయం జాగింగ్ వెళ్లే వారు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందించారు.