త్వరలోనే తెలంగాణకు బస్సు సర్వీసులు: బ్రహ్మానందరెడ్డి
దిశ, ఏపీ బ్యూరో: రెండు తెలుగు రాష్ట్రాలకు బస్సులు నడపడంపై వచ్చేవారం స్పష్టత వస్తుందని ఏపీఎస్‌ఆర్టీసీ ఆపరేషన్స్ ఈడీ బ్రహ్మానందరెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన సమయంలో ఇంటర్ స్టేట్ అగ్రిమెంట్ కాలేదని వెల్లడించారు. ఏపీ నుంచి తెలంగాణకు నాలుగు దశల్లో 256 బస్సు సర్వీసులు నడపాలన్న ఆలోచనలో ఉన్నామని అన్నారు. దీనిపై మరో భేటీ తరువాత స్పష్టత వస్తుందని, వచ్చే వారం నుంచి బస్సులు నడిపే అవకాశం ఉందని అంచనా […]
దిశ, ఏపీ బ్యూరో: రెండు తెలుగు రాష్ట్రాలకు బస్సులు నడపడంపై వచ్చేవారం స్పష్టత వస్తుందని ఏపీఎస్‌ఆర్టీసీ ఆపరేషన్స్ ఈడీ బ్రహ్మానందరెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన సమయంలో ఇంటర్ స్టేట్ అగ్రిమెంట్ కాలేదని వెల్లడించారు. ఏపీ నుంచి తెలంగాణకు నాలుగు దశల్లో 256 బస్సు సర్వీసులు నడపాలన్న ఆలోచనలో ఉన్నామని అన్నారు. దీనిపై మరో భేటీ తరువాత స్పష్టత వస్తుందని, వచ్చే వారం నుంచి బస్సులు నడిపే అవకాశం ఉందని అంచనా వేశారు.
కాగా, తెలంగాణలో బస్సుల రాకపోకలపై ఆంక్షలు ఎత్తేసిన విషయం తెలిసిందే. అలాగే, ఏపీలోనూ అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు ప్రారంభించారు. రాష్ట్రంలోని వివిధ పట్టణాల నుంచి బెంగళూరుకు బస్సులు నడుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ నుంచి హైదరాబాద్‌కు బస్సులు నడిపేందుకు తెలంగాణ ఆర్టీసీ ప్రతినిధులతో చర్చలు జరిపారు.