తెలంగాణలో నేటి నుంచే ఇంటర్ పరీక్షలు

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి ఇంటర్​పరీక్షలు ప్రారంభం కానున్నాయి. 1,768 పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. సుమారు 4.59 లక్షల మంది ఎగ్జామ్స్ రాయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రతీ కేంద్రంలో కరోనా నిబంధనలు అమలయ్యేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని బోర్డు అధికారులు తెలిపారు. హాల్‌‌లో మాస్కు ధరించడంతో పాటు, భౌతిక దూరం ఉండేలా సీట్లను ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులు ఎలాంటి టెన్షన్​లేకుండా పరీక్షలు రాయాలని అధికారులు సూచిస్తున్నారు. పరీక్ష హాల్‌లోకి […]

Update: 2021-10-24 13:07 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి ఇంటర్​పరీక్షలు ప్రారంభం కానున్నాయి. 1,768 పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. సుమారు 4.59 లక్షల మంది ఎగ్జామ్స్ రాయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రతీ కేంద్రంలో కరోనా నిబంధనలు అమలయ్యేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని బోర్డు అధికారులు తెలిపారు. హాల్‌‌లో మాస్కు ధరించడంతో పాటు, భౌతిక దూరం ఉండేలా సీట్లను ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులు ఎలాంటి టెన్షన్​లేకుండా పరీక్షలు రాయాలని అధికారులు సూచిస్తున్నారు. పరీక్ష హాల్‌లోకి వాటర్​బాటిల్స్‌కు అనుమతి ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ సారి కేవలం 70 శాతం సిలబస్‌తో మాత్రమే పరీక్ష జరగనుంది. మూడు సెట్ల పరీక్ష పత్రాల విధానం కొనసాగుతుంది. మరోవైపు హుజూరాబాద్​ ఉప ఎన్నిక కారణాన ఈ నెల 30న జరగాల్సిన పరీక్షను మరోసటి రోజు 31కు వాయిదా వేశారు.

Tags:    

Similar News