30శాతం ఇంటర్ సిలబస్ కుదింపు..!

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా నేపథ్యంలో తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ సిలబస్‌ను 30 శాతం కుదించింది. 2020-21 సంవత్సరానికి మాత్రమే సిలబస్ తగ్గింపు నిబంధన కొనసాగుతుందని ప్రకటించింది. దేశవ్యాప్తంగా, రాష్ట్రంలోనూ కరోనా విజృంభణ కొనసాగుతుండటంతో జీరో ఇయర్ కాకుండా ఆన్‌లైన్ తరగతులు నిర్వహిస్తామని తెలిపింది. కేంద్రం, సీబీఎస్‌ఈ సూచనల మేరకే ఇంటర్ పాఠ్యాంశాలను తగ్గించేందుకు కమిటీనిని ఏర్పాటు చేసినట్లు బోర్డు పేర్కొంది. అయితే, తగ్గించిన సిలబస్‌ను […]

Update: 2020-09-22 10:17 GMT

దిశ, వెబ్‌డెస్క్ :

కరోనా నేపథ్యంలో తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ సిలబస్‌ను 30 శాతం కుదించింది. 2020-21 సంవత్సరానికి మాత్రమే సిలబస్ తగ్గింపు నిబంధన కొనసాగుతుందని ప్రకటించింది.

దేశవ్యాప్తంగా, రాష్ట్రంలోనూ కరోనా విజృంభణ కొనసాగుతుండటంతో జీరో ఇయర్ కాకుండా ఆన్‌లైన్ తరగతులు నిర్వహిస్తామని తెలిపింది. కేంద్రం, సీబీఎస్‌ఈ సూచనల మేరకే ఇంటర్ పాఠ్యాంశాలను తగ్గించేందుకు కమిటీనిని ఏర్పాటు చేసినట్లు బోర్డు పేర్కొంది. అయితే, తగ్గించిన సిలబస్‌ను ఇంటర్ వైబ్‌సైట్‌లో విద్యార్థులకు అందుబాటులో ఉంటుందని బోర్డు అధికారులు వెల్లడించారు.

Tags:    

Similar News