విద్యాశాఖ సంచలన నిర్ణయం.. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు రద్దు

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ విద్యాశాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా తీవ్రత నేపథ్యంలో పదో తరగతి పరీక్షలు రద్దు చేసి ఇంటర్ పరీక్షలను మాత్రం యధావిధిగా నిర్వహిస్తారని అంతా భావించారు. దీనిపై సమీక్ష నిర్వహించిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పదో తరగతితో పాటు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలను సైతం రద్దు చేయాలని సంచలన నిర్ణయం తీసుకున్నారు. సెకండ్ ఇయర్ విద్యార్థులకు మాత్రం పరీక్షలు నిర్వహిస్తామని, ఇదివరకు నిర్ణయించిన తేదీలను వాయిదా వేయడమే కాకుండా, […]

Update: 2021-04-15 07:41 GMT

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ విద్యాశాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా తీవ్రత నేపథ్యంలో పదో తరగతి పరీక్షలు రద్దు చేసి ఇంటర్ పరీక్షలను మాత్రం యధావిధిగా నిర్వహిస్తారని అంతా భావించారు. దీనిపై సమీక్ష నిర్వహించిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పదో తరగతితో పాటు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలను సైతం రద్దు చేయాలని సంచలన నిర్ణయం తీసుకున్నారు.

సెకండ్ ఇయర్ విద్యార్థులకు మాత్రం పరీక్షలు నిర్వహిస్తామని, ఇదివరకు నిర్ణయించిన తేదీలను వాయిదా వేయడమే కాకుండా, త్వరలోనే కొత్త తేదీలను ప్రకటించనున్నట్లు తెలిపారు. విద్యాశాఖ అధికారులతో టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణ సాధ్యసాధ్యాలపై చర్చించాకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎగ్జామ్స్ రద్దుకు సంబంధించిన ఫైలు పై సీఎం కేసీఆర్ సంతకం చేసినట్లు సమాచారం. కాగా, ఇప్పటికే సీబీఎస్‌ఈ టెన్త్ పరీక్షలను రద్దవ్వగా, ఇంటర్ పరీక్షలను వాయిదా వేసిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News