ఇంటెలిజెన్స్ సంస్థలు కావు..సైన్స్ పరిజ్ఞానం కావాలి. చైనా
దిశ వెబ్‌డెస్క్ : కరోనా వైరస్ మూలాల కనుగొనాలంటే ఇంటలిజెన్స్ సంస్థలు కాకుండా..సైన్స్ పరిజ్ఞానం వాడాలని చైనా విదేశాంగ అధికార ప్రతినిధి వాంగ్ వెబిన్ అమెరికా పై విమర్శలు గుప్పించారు. అమెరికా చేసే పనులు సైన్స్ అంగీకరించవని, ముందస్తుగా తాము అనుకున్న నివేదికను అమెరికా ప్రభుత్వానికి అందించడానికి నిఘా సంస్థలు సిద్ధంగా ఉన్నాయని ఆయన ఆరోపించారు. మీ దేశంలో మరణాలు సంభవించడానికి కారణం మీ రాజకీయ నాయకుల వైఫల్యం అంటూ ఆయన నిప్పులు చెరిగారు. అమెరికాలో కొవిడ్ […]
దిశ వెబ్‌డెస్క్ : కరోనా వైరస్ మూలాల కనుగొనాలంటే ఇంటలిజెన్స్ సంస్థలు కాకుండా..సైన్స్ పరిజ్ఞానం వాడాలని చైనా విదేశాంగ అధికార ప్రతినిధి వాంగ్ వెబిన్ అమెరికా పై విమర్శలు గుప్పించారు. అమెరికా చేసే పనులు సైన్స్ అంగీకరించవని, ముందస్తుగా తాము అనుకున్న నివేదికను అమెరికా ప్రభుత్వానికి అందించడానికి నిఘా సంస్థలు సిద్ధంగా ఉన్నాయని ఆయన ఆరోపించారు. మీ దేశంలో మరణాలు సంభవించడానికి కారణం మీ రాజకీయ నాయకుల వైఫల్యం అంటూ ఆయన నిప్పులు చెరిగారు. అమెరికాలో కొవిడ్ వల్ల చనిపోయిన సమయంలో రాజకీయ నాయకత్వం విమర్శలు గుప్పించుకునే బదులు ఆరోగ్యరంగం పై దృష్టి పెట్టి ఉంటే బావుండేదని హితవు పలికారు. తాము ఇది వరకే దేశంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ బృందాన్ని అనుమతి ఇచ్చామని, అప్పుడు ఎలాంటి ఆధారాలు మా దగ్గర నుంచి లభించలేదని ఆయన అన్నారు. అమెరికా అధ్యక్షుడు ఇంటలిజెన్స్ సంస్థలకు విధించిన గడువు దగ్గర పడుతున్న కొద్ది చైనాలో ఆందోళన ఎక్కువతున్నట్లు ఈ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి .