South Central Railway : రైల్వేలో ఏకీకృత వీడియో నిఘా వ్యవస్థ
దిశ, తెలంగాణ బ్యూరో : ప్రయాణికుల రక్షణ, భద్రత మెరుగుకు దక్షిణ మధ్య రైల్వేలో ఏకీకృత వీడియో నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య తెలిపారు. జోన్ స్థాయిలో మొదటి దశలో 17 స్టేషన్లలో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ వీడియో సర్వేయిలెన్స్ సిస్టం కంట్రోల్ రూమ్ ను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాల్య మాట్లాడుతూ 17 స్టేషన్లల రక్షిత నిఘా వ్యవస్థ పుటేజీని స్టేషన్, డివిజన్ […]
దిశ, తెలంగాణ బ్యూరో : ప్రయాణికుల రక్షణ, భద్రత మెరుగుకు దక్షిణ మధ్య రైల్వేలో ఏకీకృత వీడియో నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య తెలిపారు. జోన్ స్థాయిలో మొదటి దశలో 17 స్టేషన్లలో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ వీడియో సర్వేయిలెన్స్ సిస్టం కంట్రోల్ రూమ్ ను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాల్య మాట్లాడుతూ 17 స్టేషన్లల రక్షిత నిఘా వ్యవస్థ పుటేజీని స్టేషన్, డివిజన్ సెక్యూరిటీ కంట్రోల్ రూమ్, జోనల్ సెక్యూరిటీ కంట్రోల్ వద్ద పర్యవేక్షించవచ్చన్నారు. మూడు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రాలలోని 17 స్టేషన్లు ఉన్నాయని తెలిపారు. తెలంగాణలో ఆదిలాబాద్, బేగంపేట్, లింగంపల్లి, మంచిర్యాల, వరంగల్, ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు, కడప, కర్నూల్ టౌన్, నెల్లూరు, ఒంగోలు, రాజమండి, తుని, మహారాష్ట్రలోని ఔరంగాబాద్, ధర్మాబాద్, జాల్న, నాగర్ సోల్, పర్లివైద్యనాథ్ స్టేషన్లు ఉన్నాయన్నారు.
రైల్వే మంత్రత్వశాఖ పరిధిలోని మినీరత్న పీఎస్‌యూ అయిన రైల్‌టెల్ సెంట్రలైజ్డ్ కంట్రోల్ రూం ఏర్పాటుకు 13 రైల్వే స్టేషన్ల వద్ద, 4 స్టేషన్లు ఔరంగాబాద్, గుంటూరు, రాజమండ్రి, వరంగల్ వద్ద ప్రస్తుత ఇంటి గ్రేటెడ్ సీసీటీవీ స్థానాల్లో ఇంటర్నెట్ ప్రొటోకాల్ ఆధారిత వీఎస్ఎస్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గతంలో ఏర్పాటైన ఇంటర్నెట్ ప్రొటోకాల్ ఓఎన్బీఐఎఫ్ కెమెరాలను భారతీయ రైల్వే మొదటిసారిగా నూతన వీఎస్ఎస్ వ్యవస్థతో అనుసంధానించిందని తెలిపారు. 24 గంటలు పర్యవేక్షణలో ఉండే సెంట్రలైజ్డ్ సీసీటీవీ కంట్రోల్ రూమ్ కు వీడియో పుటేజీలను పంపడానికి ఆప్టికల్ ఫైబర్ కేబుల్ తో 17 స్టేషన్లను 520 సీసీటీవీ కెమెరాలతో రైల్ టెల్ అనుసంధానించిందని పేర్కొన్నారు. ముఖం కవలికలను స్పష్టంగా గుర్తించడానికే 4కే రిసోలుషన్ అల్ట్రా హెచ్డీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు.
రైల్ టెల్ చైర్మన్, ఎండీ పునీత్ చావ్లా మాట్లాడుతూ వీడియో నిఘా వ్యవస్థను త్వరలోనే అన్ని స్టేషన్లకు, కోచ్ లకు విస్తరిస్తామన్నారు. 2021-22 చివరి నాటికి మొత్తం 76 స్టేషన్లలో అధిక సాంకేతిక రక్షిత విధానంతో వీఎస్ఎస్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో రైల్వే ఉద్యోగులు పాల్గొన్నారు.