2020-21లో 5 శాతం వృద్ధి సాధించిన సాధారణ బీమా పరిశ్రమ
దిశ, వెబ్‌డెస్క్: గతేడాది లాక్‌డౌన్ కారణంగా మోటార్, పంట ప్రమాద బీమా విభాగాలు తగ్గినప్పటికీ ఆరోగ్య, అగ్ని ప్రమాద బీమా విభాగాల్లో ఇన్సూరెన్స్ పెరగడంతో భారత సాధారణ బీమా పరిశ్రమ 5 శాతం వృద్ధిని సాధించింది. స్టార్ హెల్త్, ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్, మ్యాక్స్ బుపా వంటి స్వతంత్ర ఆరోగ్య బీమా సంస్థలు తమ స్థూల ప్రత్యక్ష ప్రీమియం ఆదాయంలో బలమైన వృద్ధిని నమోదు చేశాయి. మార్చి, ఏప్రిల్ నెలల్లో కర్నా కేసుల పెరుగుదలతో భారత్‌లో […]
దిశ, వెబ్‌డెస్క్: గతేడాది లాక్‌డౌన్ కారణంగా మోటార్, పంట ప్రమాద బీమా విభాగాలు తగ్గినప్పటికీ ఆరోగ్య, అగ్ని ప్రమాద బీమా విభాగాల్లో ఇన్సూరెన్స్ పెరగడంతో భారత సాధారణ బీమా పరిశ్రమ 5 శాతం వృద్ధిని సాధించింది. స్టార్ హెల్త్, ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్, మ్యాక్స్ బుపా వంటి స్వతంత్ర ఆరోగ్య బీమా సంస్థలు తమ స్థూల ప్రత్యక్ష ప్రీమియం ఆదాయంలో బలమైన వృద్ధిని నమోదు చేశాయి. మార్చి, ఏప్రిల్ నెలల్లో కర్నా కేసుల పెరుగుదలతో భారత్‌లో ఆరోగ్య బీమా తీసుకునే వారి సంఖ్య పెరిగింది. ఇది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆరోగ్య బీమా ప్రీమియంల వృద్ధి సానుకూల మద్ధతు అని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ తెలిపింది.
ఏప్రిల్ 20 నాటికి సుమారు రూ. 9 వేల కోట్ల క్లెయిమ్‌లను పరిష్కరించాయి. గతేడాది మార్చి నాటికి సుమారు రూ. 14.9 వేల కోట్ల కంటే ఇది తక్కువే. వచ్చే నెల నుంచి ఎక్కువమందికి టీకాను ఇవ్వనున్న నేపథ్యంలో క్లెయిమ్‌లు తగ్గుతున్నాయని పైశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. మొత్తం పరిస్రమలో ఆరోగ్య బీమా 13.5 శాతం పెరిగి 27 శాతానికి వృద్ధి సాధించగా, మొటార్ బీమా 2 శాతం, అగ్రి ఇన్సూరెన్స్ 3.4 శాతం తగ్గాయి. ఐసీఐసీఐ జనరల్ ఇన్సూరెన్స్ తమ మోటార్ ప్రీమియంలో 3 శాతం వృద్ధి సాధించగా, నేషనల్ ఇన్సూరెన్స్ 15 శాతం, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ 11 శాతం, బజాజ్ అల్యాంజ్ 10 శాతం, న్యూ ఇండియా ఇన్సూరెన్స్ 1 శాతం క్షీణించాయి.