హెల్త్ కేర్ మృతులకు రూ.28 కోట్ల భీమా పరిహారం
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ర్ట వ్యాప్తంగా 56 మంది హెల్త్ కేర్ కరోనా మృతులకు కోవిడ్ భీమా పరిహారం అందింది. ఒక్కోక్కరికీ తలా రూ. 50 లక్షల చొప్పున రూ. 28 కోట్లను అందజేసినట్లు వైద్యశాఖ అధికారులు తెలిపారు. వీరిలో ఆరుగురు డాక్టర్లు, స్టాఫ్ నర్సు, ఇద్దరు హెడ్ నర్సులు, ముగ్గురు ఏఎన్ఎంలు, 6 ఎంపీహెచ్ఏలు, ఇద్దరు ఎంపీహెచ్ఎస్ లు, ఇద్దరు ఎంపీహెచ్ ఇఓలు, హెచ్ ఇ, ముగ్గురు ల్యాబ్ టెక్నీషియన్లు, ఇఇజీ టెక్నీషియన్, ఫార్మాసిస్ట్, సీహెచ్ […]
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ర్ట వ్యాప్తంగా 56 మంది హెల్త్ కేర్ కరోనా మృతులకు కోవిడ్ భీమా పరిహారం అందింది. ఒక్కోక్కరికీ తలా రూ. 50 లక్షల చొప్పున రూ. 28 కోట్లను అందజేసినట్లు వైద్యశాఖ అధికారులు తెలిపారు. వీరిలో ఆరుగురు డాక్టర్లు, స్టాఫ్ నర్సు, ఇద్దరు హెడ్ నర్సులు, ముగ్గురు ఏఎన్ఎంలు, 6 ఎంపీహెచ్ఏలు, ఇద్దరు ఎంపీహెచ్ఎస్ లు, ఇద్దరు ఎంపీహెచ్ ఇఓలు, హెచ్ ఇ, ముగ్గురు ల్యాబ్ టెక్నీషియన్లు, ఇఇజీ టెక్నీషియన్, ఫార్మాసిస్ట్, సీహెచ్ ఓ, ముగ్గురు పీహెచ్ఎన్లు, ఇద్దరు ఎమ్ ఎన్ ఓలు, ఎఫ్ ఎన్ ఓ, సూపరింటెండెంట్ , రిఫ్రిజిరేటర్ మెకానిక్ , ఇద్దరు శానిటరీ సూపర్వైజర్ , ఐదుగురు ఆశాలు, ఇద్దరు డ్రైవర్లు, ఇద్దరు ధోభీ వర్కర్లు, డీఇఓ, వాచ్ మెన్, ఇద్దరు టెక్నికల్ వర్కర్లు, ముగ్గురు స్వీపర్లులతో పాటు ఆఫీస్ సబార్డీనెంట్ ఉన్నట్లు అధికారులు తెలిపారు.
కోవిడ్ తో చనిపోయిన హెల్త్ కేర్ వర్కర్లకు దేశ వ్యాప్తంగా స్పెషల్ ఇన్సురెన్స్ ద్వారా కేంద్ర ప్రభుత్వమే ఒక్కోక్క వ్యక్తికి రూ. 50 లక్షలు సాయం చేస్తోంది. కానీ కరోనా తో చనిపోయిన వైద్యసిబ్బందికి రాష్ర్ట ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా ఎలాంటి సాయం అందడం లేదు. దీంతో కేంద్రం అందించే సాయానికి అదనంగా రాష్ర్ట ప్రభుత్వం కూడా ఒక్కో వ్యక్తికి రూ. 25 లక్షలు ఇవ్వాలని మెడికల్ యూనియన్లు గతంలో ప్రభుత్వానికి విన్నపించినా పట్టించుకోలేదు.