అక్కడ మందుబాబులకు షాక్.. వ్యాక్సిన్ తీసుకోనివారికి నో లిక్కర్

దిశ, డైనమిక్ బ్యూరో: కరోనా కట్టడి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు వ్యాక్సిన్‌ అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అర్హులందరికీ వ్యాక్సిన్ అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ చర్యలు తీసుకుంటున్నాయి. కానీ, కొందరు వ్యాక్సిన్ తీసుకునేందుకు జంకుతున్నారు. వీరిలో భయాన్ని తొలగించి వ్యాక్సిన్ తీసుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాకుండా, ఇప్పటికీ వ్యాక్సిన్ తీసుకోనివారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధపడుతున్నారు. ఈ క్రమంలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కండవా జిల్లాలో పూర్తిగా రెండు వ్యాక్సిన్లు తీసుకున్నవారికి మాత్రమే లిక్కర్ […]

Update: 2021-11-20 03:17 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: కరోనా కట్టడి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు వ్యాక్సిన్‌ అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అర్హులందరికీ వ్యాక్సిన్ అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ చర్యలు తీసుకుంటున్నాయి. కానీ, కొందరు వ్యాక్సిన్ తీసుకునేందుకు జంకుతున్నారు. వీరిలో భయాన్ని తొలగించి వ్యాక్సిన్ తీసుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాకుండా, ఇప్పటికీ వ్యాక్సిన్ తీసుకోనివారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధపడుతున్నారు. ఈ క్రమంలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కండవా జిల్లాలో పూర్తిగా రెండు వ్యాక్సిన్లు తీసుకున్నవారికి మాత్రమే లిక్కర్ అమ్మాలని జిల్లా ఎక్సైజ్ అధికారి ఆర్పీ కిరార్ ఆదేశించారు. ఈ విషయాన్ని అన్ని వైన్స్ షాపుల ముందు పోస్టర్లు, బ్యానర్లు కట్టి ప్రదర్శించాలని తెలిపారు.

epaper – 1:00 PM TS EDITION (20-11-21) చదవండి

 

Tags:    

Similar News