మార్కెట్‌లో ఇన్‌స్టెంట్ ఫుడ్.. ట్రై చేశారా..?
దిశ, శేరిలింగంపల్లి: ఉరుకుల పరుగుల జీవితంలో ఉదయం టిఫిన్ తయారీ గృహిణులకు భారంగా మారింది. ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగస్తులయితే ఇంకా కష్టం. ఉదయం పిల్లలకు టిఫిన్చేయాలంటే గగనమే మరి. సాయంకాలం వరకు జాబ్ చేసి అలసి సొలసి వచ్చి ఇంట్లో పనులు చక్కబెట్టుకుని వంటచేయాలంటే ఆ గృహిణికి ఎంత కష్టం. ఇడ్లీ, దోష, వడ ఏది చేయాలన్నా ఒక రోజు ముందుగానే ప్రిపరేషన్చేయాలి. పిండి, పప్పు నానబెట్టి మిక్సీలో వేసి ఫ్రిజ్‌లో పెట్టి ఉదయమే టిఫిన్చేయాలి. […]
దిశ, శేరిలింగంపల్లి: ఉరుకుల పరుగుల జీవితంలో ఉదయం టిఫిన్ తయారీ గృహిణులకు భారంగా మారింది. ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగస్తులయితే ఇంకా కష్టం. ఉదయం పిల్లలకు టిఫిన్చేయాలంటే గగనమే మరి. సాయంకాలం వరకు జాబ్ చేసి అలసి సొలసి వచ్చి ఇంట్లో పనులు చక్కబెట్టుకుని వంటచేయాలంటే ఆ గృహిణికి ఎంత కష్టం. ఇడ్లీ, దోష, వడ ఏది చేయాలన్నా ఒక రోజు ముందుగానే ప్రిపరేషన్చేయాలి. పిండి, పప్పు నానబెట్టి మిక్సీలో వేసి ఫ్రిజ్‌లో పెట్టి ఉదయమే టిఫిన్చేయాలి. ఇక బ్యాచిలర్స్ తప్పనిసరిగా హోటల్‌కు వెళ్లాల్సిన పరిస్థితి. ఈ కష్టాలకు చెక్‌పెట్టేసింది ఇన్‌స్టంట్‌ఫుడ్.. క్షణాల్లో కోరుకున్న వంటను రెడీ చేసుకునే అవకాశం ఏర్పడింది. మార్కెట్‌లో రెడీమేడ్‌గా లభించే తీరొక్క పిండితో నచ్చిన ఇడ్లీ, దోష, వడ, ఉప్మా ఇలా ఏది కావాలంటే అది చేసుకోవచ్చు. ప్రస్తుతం నగరంలో ఇన్స్టంట్ఫుడ్కు భలే డిమాండ్ ఏర్పడింది.
ఉదయం టిఫిన్స్ రెడీ చేయాలంటే అందుకోసం ముందురోజే ప్రిపరేషన్ చేయాలి. కానీ ఇప్పుడు అలాంటి టెన్షన్స్ ఏమీ అవసరం లేదు. సూపర్ మార్కెట్లు వచ్చాక ప్రతీ వస్తువు అందుబాటులోకి వచ్చేసింది. ఎన్నెన్నో వెరైటీ వంటకాలు చేసేందుకు గృహిణులు కూడా సూపర్ మార్కెట్ బాట పడుతున్నారు. ఇడ్లీలు చేయాలంటే ముందు రోజే ప్రిపరేషన్స్ అవసరం లేదు. దోష కోసం గ్రైండర్‌తో కుస్తీ పట్టాల్సిన పనిలేదు. పరోటాలు కావాలంటే మైదా తెచ్చి రెడీ చేసుకోవాలన్న ఇబ్బందే లేదు. సూపర్ మార్కెట్‌కు వెళితే చాలు. మీకు ఇష్టమైన టిఫిన్స్ కోసం అన్ని పదార్థాలు రెడీగా ఉంటాయి. ఇంటికి తెచ్చుకుని నిమిషాల్లో వంట చేసుకుని ఆరగించడమే ఆలస్యం.
లాభాల్లో తయారీదారులు..
రెడీమేడ్ టిఫిన్స్ తయారీ ఐడియాను ఫస్ట్ మార్కెట్లోకి తెచ్చింది ఐడీ బ్రాండ్ సంస్థ. వీరు ఇన్స్టంట్ దోష, ఇడ్లి పిండిని ముందు మార్కెట్ చేసే వారు. నగర జనాలకు ఈ ఐడియా బాగా నచ్చడంతో ఫుల్ సక్సెస్ అయ్యింది. అదే జోష్‌తో ఆ సంస్థ మరిన్ని ఉత్పత్తులను తీసుకువచ్చింది. ఇప్పుడు చపాతీ, పరోటా, వడ, బజ్జీ ఇలా టిఫిన్స్‌లో ఎన్ని రకాలు ఉంటాయో అన్ని రకాల వంటకాలకు సంబంధించిన మెటీరియల్‌ను సప్లయ్ చేస్తూ లాభాలు గడిస్తుంది. ఇప్పుడు ఇదే దారిలో ఎన్నో సంస్థలు రెడీమేడ్ టిఫిన్స్ మార్కెట్ చేస్తున్నాయి. కరోనా తర్వాత లేబర్ తగ్గడంతో హోటల్స్ కూడా ఇన్స్టంట్ టిఫిన్స్ మెటీరియల్స్ పై ఆధారపడుతున్నాయి. ఖర్చు కూడా తక్కువగానే ఉండడంతో హోటల్స్ లేబర్‌ను పెట్టుకునేకంటే రెడీమేడ్‌గా తయారు చేసే వంటకాలపై ఆధారపడుతున్నారు.
ఉద్యోగులు, బ్యాచిలర్స్‌కు అనువుగా..
నగరంలో బ్యాచిలర్స్‌కు ఇన్స్టంట్ ఫుడ్ ఐడియా బాగా నచ్చింది. షాప్‌నుంచి కావాల్సిన పిండి తెచ్చుకోవడం, నిమిషాల్లో రెడీ చేసుకుని ఏదో ఒక పచ్చడి వేసుకుని హాయిగా తినేస్తున్నారు. అలాగే ఉద్యోగస్తులైన గృహిణులకు కూడా ఇది బాగా యూజ్ అవుతోంది. ముందురోజు పనులు మానుకుని టిఫిన్స్ కోసం ప్రిపరేషన్ చేయాల్సిన పనిలేదు కాబట్టి ఇన్‌స్టంట్‌గా రెడీ చేసుకునే ఫుడ్‌కు డిమాండ్ పెరిగింది. ఇంట్లోనే క్షణాల్లో వంటలు రెడీ చేసి పిల్లలకు పెట్టి వారు తినేసి వెళ్తున్నారు. అయితే ఇదంతా మంచిది కాదని, మనం తయారు చేసుకునేలా ఉండదని అంటున్నారు ఇంకొంతమంది గృహిణులు. అలాగే నిల్వ సామర్థ్యం, తయారీ విధానం, ఎలా చేశారో తెలియదు కాబట్టి ప్యాకింగ్ ఫుడ్ మంచిది కాదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఏదైనా వాడేప్పుడు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవడం మంచిదని సలహా ఇస్తున్నారు ఆహార నిపుణులు.
రెడీమిక్స్ ఫుడ్ బాగుంది..
ఉద్యోగాలు చేస్తున్న మాలాంటి వారికి రెడీమిక్స్ ఫుడ్ బాగుంటుంది. ఇడ్లి, దోష, పూరి, చపాతీ, పరోటా లాంటి ఎన్నో రకాల రెడీమేడ్ పిండి మార్కెట్‌లో లభిస్తున్నాయి. క్వాలిటీ పరంగా కూడా బాగున్నాయి. అప్పటికప్పుడు రెడీ చేసుకుని నిమిషాల్లో వేడివేడిగా తినేయొచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టపడుతున్నారు.
–లక్ష్మి, ఉద్యోగి
ఇంట్లో తయారు టేస్ట్ వేరు..
మార్కెట్లో ఇప్పుడు చాలా రకాల రెడీ మిక్స్ ఫుడ్స్ అందుబాటులో ఉన్నాయి. కానీ, అవి ఇంట్లో తయారు చేసుకునే వాటిలా టేస్ట్ ఉండవు. ఎప్పుడో తయారు చేసి ప్యాకింగ్ చేసి అమ్ముతారు. అవి ఆరోగ్యానికి కూడా అంత మంచివికావు. ఏపూటకు ఆపూట ఇంట్లో తయారు చేసుకుని తినడం ఆరోగ్యకరం. –వసంత, గృహిణి