ఇన్‌స్టా‌లోనూ ఇక ఫుడ్ ఆర్డర్

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా వల్ల చాలా బిజినెస్‌లు కుదేలైపోయాయి. ముఖ్యంగా ఫుడ్ సెక్టార్ ఇండస్ట్రీలో తీవ్ర సంక్షోభం ఏర్పడింది. లాక్డౌన్‌లో ఏర్పడిన నష్టాలను భర్తీ చేసుకోవడానికి, తిరిగి తమ బిజినెస్ ను రూట్ లో పెట్టుకోవడానికి ఆయా రెస్టారెంట్లు, హోటల్స్ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే చిన్న చిన్న రెస్టారెంట్లను ఆదుకునేందుకు ఫుడ్‌ డెలీవరీ సంస్థలు స్విగ్గీ, జోమాటోతో భాగస్వామ్యం అవుతున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌ తాజాగా వెల్లడించింది. ఇకపై ‘ఇన్‌స్టాగ్రామ్‌’నుంచి కూడా నెటిజన్లు ఫుడ్‌ ఆర్డర్‌ చేసుకోవచ్చు. […]

Update: 2020-06-05 03:53 GMT

దిశ, వెబ్‌డెస్క్ :
కరోనా వల్ల చాలా బిజినెస్‌లు కుదేలైపోయాయి. ముఖ్యంగా ఫుడ్ సెక్టార్ ఇండస్ట్రీలో తీవ్ర సంక్షోభం ఏర్పడింది. లాక్డౌన్‌లో ఏర్పడిన నష్టాలను భర్తీ చేసుకోవడానికి, తిరిగి తమ బిజినెస్ ను రూట్ లో పెట్టుకోవడానికి ఆయా రెస్టారెంట్లు, హోటల్స్ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే చిన్న చిన్న రెస్టారెంట్లను ఆదుకునేందుకు ఫుడ్‌ డెలీవరీ సంస్థలు స్విగ్గీ, జోమాటోతో భాగస్వామ్యం అవుతున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌ తాజాగా వెల్లడించింది. ఇకపై ‘ఇన్‌స్టాగ్రామ్‌’నుంచి కూడా నెటిజన్లు ఫుడ్‌ ఆర్డర్‌ చేసుకోవచ్చు. ఇన్ స్టా తమ కస్టమర్ల ఫుడ్ ఆర్డర్ కోసం.. స్పెషల్ ఫుడ్ ఆర్డర్ స్టిక్కర్లను రిలీజ్ చేసింది. లేటెస్ట్ వెర్షన్ ఇన్ స్టా లో ఈ ఫుడ్ స్టిక్కర్లు అందుబాటులో ఉన్నాయి. స్మాల్ స్కేల్ రెస్టారెంట్లు తమ ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో ఈ స్టిక్కర్‌లను షేర్‌ చేసుకోవచ్చు. వీటిపై ట్యాప్ చేసి.. కస్టమర్లు ఈజీగా తమకు కావాల్సిన ఫుడ్ ను ఆర్డర్ చేసుకోవచ్చు. ఇన్ స్టా యూజర్లు కూడా తమ స్టోరీ, ప్రొఫైల్‌లో స్విగ్గీ, జోమాటో లింక్‌ను షేర్‌ చేసుకోవచ్చు. ఇన్ స్టా యూజర్లు షేర్ చేయడం ద్వారా స్మాల్ స్కేల్ రెస్టారెంట్లకు ఉపయోగపడుతుందని, వారి బిజినెస్ కు హెల్ప్ కూడా అవుతుందని స్విగ్గీ తెలిపింది.

Tags:    

Similar News